Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

క‌మ‌ల్ హాస‌న్ షూట్ ఈరోజే మొద‌లైంది

Advertiesment
Kamal Haasan
Kamal- lokesh
క‌మ‌ల్ హాస‌న్ న‌టిస్తున్న `విక్ర‌మ్‌` షూట్ ఈరోజే మొద‌లైంది. గ‌త కొంత‌కాలంగా క‌రోనావ‌ల్ల వాయిదా ప‌డ‌డం, కమ‌ల్‌కు క‌రోనా రావ‌డం వంటి కార‌ణాలు విక్ర‌మ్ సినిమాకు బ్రేక్ ప‌డ్డాయి. ఉల‌గ నాయ‌క‌న్ క‌మ‌ల్‌హాస‌న్ కు ఇది 232వ సినిమా. ఈ సినిమాలో సౌత్‌నుంచి అగ్ర న‌టులు న‌టిస్తున్నారు.
 
ఫాజిల్‌, విజ‌య్ సేతుప‌తి, న‌రేన్‌, కాళిదాస్ జ‌య‌రామ్ లు ద‌ర్శ‌కుడు లోకేష్ క‌న‌క‌రాజ్ నేతృత్వంలో చేయ‌డానికి సిద్ధ‌మ‌య్యారు. ఈరోజు క‌మ‌ల్ ఎంట్రీ ఇచ్చాడు. ఇటీవ‌లే షూట్ ప్రారంభ‌మైన ఆయ‌న పాల్గొన‌లేదు. మిగిలిన స‌న్నివేశాలు తీసిన‌ట్లు తెలుస్తోంది. ఈరోజు క‌మ‌ల్ ద‌ర్శ‌కుడితో మాట్లాడుతున్న ఫొటోను విడుద‌ల చేశారు.
 
ఈ సినిమా ఆగ‌స్టు నుంచి కొన్ని షెడ్యూల్స్‌ను జ‌రిపారు. ఈ సినిమా నేష‌ల్ అవార్డు ఫొటోగ్రాఫ‌ర్ గిరీష్ గంగాధ‌ర్ ప‌నిచేస్తున్నారు. రాజ్ క‌మ‌ల్ ఇంట‌ర్నేష‌న‌ల్ బేన‌ర్‌పై క‌మ‌ల్ నిర్మిస్తుండ‌గా, ఆర్‌. మ‌హేంద‌ర‌న్ మ‌రో నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప‌వ‌న్ క‌ళ్యాణ్ ను లెక్క‌చేయ‌ని రాజ‌మౌళి!