Webdunia - Bharat's app for daily news and videos

Install App

మా మధ్య ఉన్నది ప్రేమ కాదు.. అదో టైపు రిలేషన్.. వరలక్ష్మి శరత్ కుమార్

Webdunia
బుధవారం, 31 అక్టోబరు 2018 (12:03 IST)
హీరో విశాల్‌, తమిళ నటి వరలక్ష్మి శరత్ కుమార్ మధ్య ప్రేమాయణం కొనసాగుతున్నట్టు గత కొన్ని రోజులుగా వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. వీటిపై వరలక్ష్మి తాజాగా స్పందించారు. 
 
తాను ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లు చెబుతా. విశాల్‌తో నాకున్న బంధం ప్రేమ కాదు. మా మధ్య ఉన్నది స్నేహం మాత్రమే. నా అభిప్రాయాల్ని తనతో పంచుకుంటూ ఉంటాను. అంతలో మాత్రాన పెళ్లి అనిరాయడం సరికాదు అని వ్యాఖ్యానించారు. 
 
అలాగే తమిళ హీరో విజయ్ నటించిన తాజా చిత్రం "సర్కార్‌"లో ప్రజలకు ఓటు విలువ గురించి చెప్పే ప్రయత్నం చేశాం. ఈ చిత్రానికి నేనే తెలుగు డబ్బింగ్ చెప్పా. నేనెప్పుడూ సినిమాను ముందే చూడను. విడుదల తర్వాత నేరుగా థియేటర్‌లో చూస్తా. కానీ ఈ సినిమాలో నా పాత్ర వరకు చూశా, బాగా వచ్చింది. నాకు ఇది సవాలుతో కూడుకున్న పాత్ర అని చెప్పింది. 
 
ఈ చిత్రం విడుదలకు ఉన్న అడ్డంకులు అధికమించి ప్రేక్షకుల ముందుకు వస్తుందన్న ఆశాభావాన్ని ఆమె వ్యక్తం చేసింది. కాగా, విశాల్ తాజా చిత్రం 'పందెంకోడి-2'. ఈ చిత్రం ఇటీవల విడుదలైంది. ఇందులో వరలక్ష్మి శరత్ కుమార్ ఓ పాత్రలో కనిపించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఎవరికాళ్లో మొక్కి మంత్రి పదవి తెచ్చుకోవాలనుకోవట్లేదు : కె.రాజగోపాల్ రెడ్డి

24 గంటల్లో భారత్‌కు మరో షాకిస్తాం : డోనాల్డ్ ట్రంప్

Bangladesh: ఐదు నెలల పాటు వ్యభిచార గృహంలో 12 ఏళ్ల బాలిక.. ఎలా రక్షించారంటే?

Pavitrotsavams: తిరుమలలో వార్షిక పవిత్రోత్సవాలు ప్రారంభం

ఆన్‌లైన్ బెట్టింగులు - అప్పులు తీర్చలేక పోస్టల్ ఉద్యోగి ఆత్మహత్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments