Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నేను ప్రేమ వివాహమే చేసుకుంటా.. అమ్మాయి రెడీగా వుంది: విశాల్

Advertiesment
నేను ప్రేమ వివాహమే చేసుకుంటా.. అమ్మాయి రెడీగా వుంది: విశాల్
, సోమవారం, 29 అక్టోబరు 2018 (16:53 IST)
పందెంకోడి-2తో హిట్ కొట్టిన విశాల్ ప్రేమ వివాహమే చేసుకుంటానని చెప్తున్నాడు. ఇప్పటికే విశాల్, వరలక్ష్మిల ప్రేమ వ్యవహారం కోలీవుడ్‌లో హాట్‌టాపిక్‌గా మారింది. ఈ నేపథ్యంలో తాను పెళ్లంటూ చేసుకుంటే ప్రేమపెళ్లే చేసుకుంటానని విశాల్ తాజా ఇంటర్వ్యూలో చెప్పారు. తనకు ఎక్కడకు వెళ్లినా.. తన పెళ్లికి సంబంధించిన ప్రశ్నలే ఎదురవుతున్నాయని.. అందుకే తనకు కూడా త్వరలోనే పెళ్లి చేసుకోవాలని వుందంటూ విశాల్ తెలిపాడు. 
 
కానీ అంతకంటే ముందు ముఖ్యమైన పని వుందని.. నిర్మాతల మండలి భవన నిర్మాణం పనులను పూర్తి చేయవలసి వుందని గుర్తు చేశారు. దీని వలన ఎంతోమంది పేద కళాకారులకు మేలు జరుగుతుంది. ఇంకా తాను పెళ్లంటూ చేసుకుంటే ప్రేమపెళ్లే చేసుకుంటాను. అమ్మాయి కూడా రెడీగా వుంది. అమ్మాయి తరఫు వాళ్లు కూడా సిద్ధంగానే వున్నారు. 
 
తన లవ్ మ్యారేజ్ విషయంలో మా అమ్మానాన్నలకు కూడా ఎలాంటి అభ్యంతరంలేదని ఆసక్తికర కామెంట్స్ చేశాడు. వరలక్ష్మి తన సోల్ మేట్ అని, తన బెస్ట్ ఫ్రెండ్ అని తెలిపారు. కానీ వరలక్ష్మినే చేసుకుంటాడా అనే దానిపై విశాల్ క్లారిటీ ఇవ్వలేదు. విశాల్ చేసిన ఈ వ్యాఖ్యలతో  ఆయన వరలక్ష్మి శరత్ కుమార్‌ను పెళ్లి చేసుకుంటారా.. లేకుంటే వేరే అమ్మాయితో విశాల్ వివాహం జరుగుతుందా అనేది చర్చనీయాంశమైంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పరువు కోసం కుమార్తె గొంతు నులిమి చంపేసి.. చితిపేర్చి కాల్చేశారు...