వారాహి చలన చిత్రం భళా తందనాన

Webdunia
బుధవారం, 22 డిశెంబరు 2021 (17:17 IST)
Sri Vishnu
విలక్షణ కథలతో తన మార్క్ చూపెడుతున్న యంగ్ హీరో శ్రీ విష్ణు ప్రస్తుతం 'భళా తందనాన' అనే కమర్షియల్ ఎంటర్‌టైనర్ మూవీలో న‌టిస్తున్నారు. బాణం ఫేమ్ దంతులూరి చైతన్య దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కేథ‌రిన్ థ్రెసా హీరోయిన్. రీసెంట్‌గా మూవీ  షూటింగ్ పూర్త‌య్యింది. ఇక‌ ప్రమోషన్స్ లో భాగంగా ఈ రోజు 'భళా తందనాన` ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు.
 
ఇన్ సైడ్ వైట్ టీ షర్ట్ ధరించి డెనిమ్ షర్ట్, బ్లూ జీన్స్‌తో ఈ పోస్టర్‌లో కనిపిస్తున్న శ్రీ విష్ణు లుక్ సినిమాపై ఆసక్తి పెంచేస్తోంది. చేతిలో రెండు తుపాకులు పట్టుకొని ఎంతో కోపంగా కనిపిస్తున్న శ్రీ విష్ణు చుట్టూ రౌడీ గ్యాంగ్ కనిపిస్తుండటం ఈ కథ ఎంత స్ట్రాంగ్‌గా ఉండనుందో చెబుతోంది. భళా తందనాన చిత్రంలో యాక్షన్ సీక్వెన్స్ లకు కొదవే ఉండదని తెలుస్తోంది.
 
హీరో శ్రీ విష్ణుని ఇప్పటిదాకా చూడని డిఫరెంట్ లుక్‌లో చూపించబోతున్నారు డైరెక్టర్ చైతన్య దంతులూరి. చిత్రంలో కేథ‌రిన్ థ్రెసా రోల్ కి కూడా  ప్రాముఖ్యత ఉండనుంది. ఇక
ప్రతినాయకుడిగా కేజిఎఫ్ ఫేమ్ రామచంద్ర రాజు రోల్ మరింత పవర్ ఫుల్‌గా ఉండనుంది.  
 
పాపులర్ ప్రొడక్షన్ హౌస్ వారాహి చలనచిత్రం బ్యానర్‌పై సాయి కొర్రపాటి సమర్పణలో రజనీ కొర్రపాటి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
 
మణి శర్మ బాణీలు కడుతుండగా.. సురేష్ రగుతు కెమెరామెన్‌గా వ్యవహరిస్తున్నారు. శ్రీకాంత్ విస్సా రచయితగా, మార్తాండ్ కే వెంకటేష్ ఎడిటర్‌గా, గాంధీ నడికుడికర్ ఆర్ట్ డైరెక్టర్‌గా, పీటర్ హెయిన్ యాక్షన్ కొరియోగ్రఫర్‌గా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

32 ఏళ్లు వచ్చినా పెళ్లి కావడంలేదని రైలు కిందపడి యువకుడు ఆత్మహత్య

ఏపీని గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీగా తీర్చిదిద్దుతాం : సీఎం చంద్రబాబు

కడుపు నొప్పితో మహిళ స్కానింగుకి వస్తే ప్రైవేట్ భాగాలను తాకుతూ వేధింపులు (video)

Gujarat: భార్యాభర్తల మధ్య కుక్క పెట్టిన లొల్లి.. విడాకుల వరకు వెళ్లింది..

ఢిల్లీ ఎర్రకోట కారుబాంబు పేలుడు : మరో వైద్యుడు అరెస్టు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నీరసంగా వుంటుందా? ఇవి తింటే శక్తి వస్తుంది

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

స్ట్రోక్ తర్వాత వేగంగా కోలుకోవడానికి రోబోటిక్ రిహాబిలిటేషన్ కీలకమంటున్న నిపుణులు

రోజుకి ఒక్క జామకాయ తింటే చాలు...

శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోతే ఎలాంటి లక్షణాలు కనబడతాయి?

తర్వాతి కథనం
Show comments