Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఔను.. నిజమే.. వకీల్ సాబ్‌తో కలిసి నడుస్తున్నా : శృతిహాసన్ (Video)

Webdunia
గురువారం, 16 జులై 2020 (13:26 IST)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం వకీల్ సాబ్. ఈ చిత్రం బాలీవుడ్ సినిమా పింక్‌కు రీమేక్. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను ప్రముఖ నిర్మాతలైన దిల్ రాజు, బోనీ కపూర్‌లు కలిసి నటిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ సింహ భాగం పూర్తి చేసుకుంది. కరోనా మహమ్మారి వెలుగు చూడకుంటే ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని ఆగస్టులో ప్రేక్షకుల ముందుకురావాల్సివుంది. 
 
కానీ, కరోనా లాక్డౌన్ కారణంగా చిత్రం షూటింగ్ గత నాలుగు నెలలుగా ఆగిపోయింది. ఈ క్రమంలో ఈ చిత్రం కోసం హీరోయిన్‌ను ఇంకా ఎంపిక చేయలేదు. ఇపుడు శృతిహాసన్ పేరు తెరపైకి వచ్చింది. గతంలో వీరిద్దరూ కలిసి నటించిన చిత్రాల్లో గబ్బర్ సింగ్ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసింది. 
 
ఇపుడు మరోమారు వకీల్ సాబ్‌తో కలిసి శృతి జతకట్టనుంది. దీనిపై ఈ అమ్మడు స్పందించింది. 'అవును.. నేను 'వకీల్‌సాబ్'లో నటిస్తున్నా. ఆ సినిమాలో నా పాత్ర ఏంటనేది ఇప్పుడే చెప్పలేను. నాకు డ్రీమ్ రోల్స్ అంటూ ఏమీ లేవు. ప్రతినాయిక పాత్ర చేయడానికైనా సిద్ధమే. నేను పూర్తిగా సంగీతంపై దృష్టి పెట్టడానికి చాలా సమయం పడుతుంది. ప్రస్తుతం నటన గురించే ఆలోచిస్తున్నాన' అని చెప్పుకొచ్చింది.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అక్కకి పెళ్లైందని బావ ఇంటికెళితే... మరదలిపై 7 ఏళ్లుగా అత్యాచారం

ప్రపంచంలోనే ప్రమాదకరమైంది కింగ్ కోబ్రా కాదు.. నత్త.. తెలుసా?

ఈ మోనాలిసాకి ఏమైంది? కన్నీటి పర్యంతమై కనిపిస్తోంది (video)

వాట్సప్ ద్వారా వడ్లు అమ్ముకుంటున్న ఆంధ్ర రైతులు, గంటల్లోనే డబ్బు

అనంత్ అంబానీ 141 కిలోమీటర్లు కాలినడకన ద్వారక చేరుకుంటారా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments