Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పవర్ స్టార్ నుంచి పవరొమాంటిక్ పోస్టర్.. సోషల్ మీడియాలో వైరల్ (Video)

Advertiesment
POWERomantic
pawan kalyan
వివాదాస్పద దర్శకుడు రామ్‌ గోపాల్ వర్మ తాజాగా ''పవర్ స్టార్'' అనే సినిమాను రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్లు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. పవర్ స్టార్ సినిమా నుంచి 'పవరొమాంటిక్' అనే పోస్టర్ని ఆర్జీవి ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు.
 
ఈ సినిమాలో పీకే, ఎమ్మెస్, ఎన్‌బీ, టీఎస్‌, నలుగురు పిల్లలు, ఎనిమిది బర్రెలు, ఆర్జీవీతో పాటు ఓ రష్యన్ మహిళ కూడా ఉంటుందని ఆయన ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఈ రష్యన్ మహిళకు సంబంధించిన పోస్టర్‌ను ఆయన శనివారం విడుదల చేశారు.  
కాగా, 'పవర్ స్టార్' పేరిట తీస్తోన్న ఈ సినిమా లోగోలో వర్మ జనసేన పార్టీ గుర్తు గ్లాసు, ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ చదివే పుస్తకాలను వాడుతోన్న సంగతి తెలిసిందే. వీటిని గొప్ప నైపుణ్యాలున్న క్రియేటివ్ సైకో డిజైన్‌ చేశాడని ఆర్జీవి చెప్పారు. కృష్ణ కార్తీక్ అనే యువకుడు ఈ పోస్టర్లను రూపొందించాడు. వాటిని తన సామాజిక మాధ్యమాల్లోనూ పోస్ట్ చేస్తున్నాడు.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

డిప్రషన్‌లో కరణ్‌ జోహార్, ఇంతకీ ఏమైంది? (Video)