Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

''పవర్ స్టార్'' ఫస్ట్ లుక్.. ఎన్నికల తరువాత కథ ఎలా వుంటుందో?

Advertiesment
''పవర్ స్టార్'' ఫస్ట్ లుక్.. ఎన్నికల తరువాత కథ ఎలా వుంటుందో?
, గురువారం, 9 జులై 2020 (13:02 IST)
Power Star
కాంట్రవర్సీల రారాజు, ప్రముఖ సినిమా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రస్తుతం పవర్ స్టార్ పేరిట సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. కేవలం కాంట్రవర్సీ, అడల్ట్ కంటెంట్ నమ్ముకొని సినిమాలు తీస్తూ.. డబ్బు చేసుకుంటున్న వర్మ.. టాలీవుడ్ హీరో పవన్ కల్యాణ్ బయోపిక్‌ను రూపొందిస్తున్నాడు. 
 
కరోనా కారణంగా థియేటర్స్ అన్ని బంద్ అవ్వడంతో ఆయన ఆర్ జి వి వరల్డ్ థియేటర్ పేరుతో ఓ యాప్‌ను డెవలప్ చేసి తన సినిమాలను అక్కడే విడుదల చేస్తున్నాడు. ఈ ఐడియా సూపర్ సక్సెస్ కావడంతో.. ఆయనకు కాసులు కురిపిస్తోంది. ఇప్పటికే మియా మాల్కోవాతో క్లైమాక్స్, శ్రీ రాపాకతో నగ్నం సినిమాలను తీసి విడుదల చేసిన వర్మ మరో నాలుగు ప్రాజెక్ట్స్ ప్రకటించాడు. దీంతో పవర్ స్టార్ అనే టైటిల్ చేయనున్నట్టు ప్రకటించారు.   అందులో కొంత ఎక్కువ వివాదస్పదమవుతోన్న సినిమాల్లో పవర్ స్టార్ ఒకటి.
 
'పవర్‌స్టార్‌' పేరుతో ఓ సినిమా తీయబోతున్నానని ట్విట్టర్‌ ద్వారా ప్రకటించిన వర్మ అందుకు సంబంధించిన ఓ వీడియోను షేర్‌ చేస్తూ 'నా కొత్త చిత్రంలో 'పవర్‌స్టార్‌' ఇతనే. మా ఆఫీసుకు వచ్చినప్పుడు ఈ వీడియో తీశాం. ఈ వ్యక్తిలో ఎవరి పోలికలైనా కనిపిస్తే అది అప్రయత్నంగా, యాదృచ్ఛికంగా జరిగినట్లుగా భావించాలి' అని గతంలో పేర్కొన్నారు. కొద్దిసేపటి క్రితం ఫస్ట్ లుక్ విడుదల చేశారు. 
 
ఆ ఫస్ట్ లుక్ పోస్టర్‌లో హీరో ఆలోచిస్తూ కూర్చొని ఉన్నారు. పోస్టర్‌పై ఎన్నికల తరువాత కథ అని, సినిమా దేని గురించి ఉంటుందో ఓ హింట్ ఇచ్చారు. ఇకపోతే.. మర్డర్, వైరస్, 12 ఓ క్లాక్, థ్రిల్లర్ అనే సినిమాలని త్వరలో వర్మ రిలీజ్ చేయనున్నాడు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పవర్ స్టార్ ఫ్యాన్స్‌ని మరోసారి కెలుకుతున్న వర్మ