Webdunia - Bharat's app for daily news and videos

Install App

జూనియ‌ర్ ప‌వ‌ర్‌స్టార్ వ‌చ్చేశాడోచ్‌!

Webdunia
శనివారం, 3 ఏప్రియల్ 2021 (16:04 IST)
Khammam uppena team
మెగాస్టార్ అంటేనే చిరంజీవి. మ‌రి ఆయ‌న కొడుకు రామ్‌చ‌ర‌ణ్ ఏమ‌వుతాడు. సినిమావాళ్ళంతా మెగా ప‌వ‌ర్ స్టార్‌ను చేసేసి పేరు ముందు పెట్టారు. దాంతో మెగా ప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ అని పిలుస్తున్నారు. ఫ్యాన్స్ అయితే వారిని ఆప‌లేం. గోల‌గోల చేసేస్తారు ఆయ‌న క‌న‌బ‌డితే. మ‌రి ప‌వ‌ర్ స్టార్ అంటే ప‌వ‌న్ క‌ళ్యాణ్ అని తెలిసిందే. మ‌రి ఆయ‌న వార‌సుల‌ని ఎవ‌రు పిలుస్తారు.

ఎలాగో మెగా ప‌వ‌ర్‌స్టార్ బిరుదు చిరంజీవి కొడుకుకు ఇచ్చేశారుగ‌దా. అందుకే మ‌రో పేరుతో వారి కుటుంబ హీరోను పిలుస్తున్నారు. ఆ పేరు  జూనియ‌ర్ వ‌ప‌ర్ స్టార్. మ‌రి ఆయ‌న ఎవ‌ర‌నుకుంటున్నారా. ప‌వ‌న్ క‌ళ్యాణ్ సోద‌రి కొడుకు. అదేనండి.. సాయితేజ్ త‌మ్ముడు. వైష్ణ‌వ్ తేజ్‌. ఉప్పెన సినిమాతో ఒక్క‌సారిగా అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచి స‌క్సెస్ కొట్టిన న‌టుడు. వైష్ణ‌వ్ తేజ్‌, కృతిశెట్టి జంట‌గా `ఉప్పెన‌` సినిమా చేశారు. ఆ సినిమా విజ‌య‌వంత‌మైంది. అందుకే ఆ జంట‌తో షాపింగ్ మాల్ ఓపెన్ చేయించారు.

కె.ఎల్‌.ఎం. అధినేత‌. ఖ‌మ్మంలోని త‌న కొత్త బ్రాంచ్‌ను శ‌నివారంనాడు ప్రారంభించారు. అప్ప‌టికే అక్క‌డ అభిమానులు ఇసుక వేస్తే రాల‌నంత‌గా ఆయ‌న్ను చూడ‌డానికి విచ్చేశారు. యాంక‌ర్ వారిని ఉషారు ప‌రుస్తూ వైష్ణ‌వ్‌తేజ్ సినిమా గురించి చెబుతుంది.

ఇక ఆయ‌న కారులో లోప‌లికి రాగానే ఒక్క‌సారి వాతావ‌ర‌ణ కోలాహ‌లంగా మారింది. జూనియ‌ర్ ప‌వ‌ర్‌స్టార్ వ‌చ్చేశాడోచ్‌.. అంటూ మూడు సార్లు తెగ అరిచేసింది. దానికి అభిమానులు కోలాహ‌లంతో ఆనందంతో విజుల్స్‌, జిందాబాద్‌లు కొట్టేశారు. మ‌రి బిరుదులు ఊరికేరావు. అని తెలిసిపోతుంది క‌దా. ఇక అక్క‌డి వాతావ‌ర‌ణాన్ని కూల్ చేయ‌డానికి కృతిశెట్టి. ఫొటోల‌కు క‌న్ను గొడుతూ ఫోజ్ ఇచ్చింది.

సంబంధిత వార్తలు

EVMను ధ్వంసం చేసిన వైసిపి ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి - video

అమలాపురం మహిళ కడుపులో 570 రాళ్లు.. అవాక్కైన వైద్యులు!!

జూన్ 4న వచ్చే ఫలితాలతో జగన్ మైండ్ బ్లాంక్ అవుతుంది : ప్రశాంత్ కిషోర్

జూన్ 8వ తేదీ నుంచి చేప ప్రసాదం పంపిణీ

బోలారం ఆస్పత్రి.. బైకులో కూలిన చెట్టు.. వ్యక్తి మృతి

చియా గింజలు తింటే ఎలాంటి ఉపయోగాలు?

రెక్టల్ క్యాన్సర్ రోగిని కాపాడేందుకు ట్రూబీమ్ రాపిడార్క్ సాంకేతికత: అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్

డ్రై ఫ్రూట్స్‌ను ఖాళీ కడుపుతో తింటే ఎంత లాభమో?

నారింజ పండ్లు తీసుకుంటే.. డీహైడ్రేషన్‌ పరార్.. గుండె ఆరోగ్యానికి మేలు..

పాలులో రొట్టె కలిపి తింటే 8 అద్భుతమైన ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments