Webdunia - Bharat's app for daily news and videos

Install App

'లక్ష్మీస్ ఎన్టీఆర్‌'కు అనూహ్య స్పందన... హైదరాబాద్ వెళ్లి సినిమా చూసిన ఉండవల్లి

Webdunia
శనివారం, 30 మార్చి 2019 (14:58 IST)
వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ తెరెక్కించిన చిత్రం 'లక్ష్మీస్ ఎన్టీఆర్'. ఈ చిత్రం ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మినహా తెలంగాణాతో పాటు ప్రపంచ వ్యాప్తంగా శుక్రవారం విడుదలైంది. ఈ చిత్రానికి విడుదలైన తొలి ఆట నుంచి అనూహ్య స్పందన వచ్చింది. ముఖ్యంగా, తొలి రోజున ఊహించనదానికంటే మంచి స్పందనతో పాటు.. వసూళ్లు కూడా ఆశించిన మేరకు ఉండటంతో చిత్ర నిర్మాతలు ఖుషీఖుషీగా ఉన్నారు. 
 
ఈ చిత్రం ఎన్టీఆర్ - లక్ష్మీపార్వతిలతో పాటు ఎన్టీఆర్ అల్లుడుగా చంద్రబాబు నాయుడు చేసిన కుట్రలు, కుతంత్రాలు, వెన్నుపోటు రాజకీయాలను ప్రధానంగా చేసుకుని చిత్రీకరించారు. దీంతో ఈ చిత్రాన్ని ఏపీలో విడుదల చేయడానికి వీల్లేదంటూ టీడీపీ నేతలు కోర్టును ఆశ్రయించారు. ఎన్నికల సమయం కావడంతో తమ పార్టీపై ఈ చిత్ర ప్రభావం పడుతుందని వారు చేసిన వాదనలతో ఏపీ హైకోర్టు అంగీకరించి, చిత్రం విడుదలపై స్టే విధించింది. దీంతో ఏప్రిల్ 13వ తేదీన ఈ చిత్రం ఏపీలో విడుదలకానుంది. 
 
ఇదిలావుంటే. తెలంగాణలోనూ, ఓవర్సీస్‌లోను ఈ సినిమాకి అనూహ్యమైన స్పందన వచ్చింది. చాలా థియేటర్స్‌లో హౌస్‌ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి. విడుదలైన అన్ని ప్రాంతాలలోను తొలి రోజున ఈ సినిమా రూ.4 కోట్ల గ్రాస్‌ను సాధించినట్టుగా చెబుతున్నారు. శని .. ఆదివారాల్లో ఈ జోరు కొనసాగే అవకాశం ఉందని అంటున్నారు. 
 
ఇదిలావుంటే, ఈ చిత్రం ఏపీలో విడుదల కాకపోవడంతో పాటు చిత్రానికి వచ్చిన టాక్‌ కారణంగా ప్రముఖ రాజకీయ నేత ఉండవల్లి అరుణ్ కుమార్ హైదరాబాద్‌కు వచ్చిమరీ ఈ చిత్రాన్ని వీక్షించారు. ఈ చిత్రానికి గీత రచయిగా పని చేసిన సిరాశ్రీ, ‘ఎమెస్కో’ అధినేత విజయ్ కుమార్‌లతో కలిసి ఉండవల్లి ఈ చిత్రం చూశారు. ఇందుకు సంబంధించిన ఓ ఫొటోను సిరాశ్రీ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

HIV: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయం.. హెచ్ఐవీ ఇన్ఫెక్షన్లు పెరిగిపోతాయ్!

14 ఏళ్ల క్రితం తప్పిపోయిన కొడుకుని తిరిగి కలుసుకున్న తల్లిదండ్రులు

పడక గదిలోకి వచ్చిన ఆవు - ఎద్దు : కప్‌బోర్డులో దాక్కున్న మహిళ (Video)

2047 నాటికి దేశాభివృద్ధి ఖాయం.. అందులో 33శాతం మనమే వుంటాం: చంద్రబాబు

ఎందుకండీ ప్రాణాల మీదికి తెచ్చుకుంటారు, ప్రాణం పోతే వస్తుందా? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments