Webdunia - Bharat's app for daily news and videos

Install App

ట్వింకిల్ ఖన్నాను ట్రోల్ చేసిన నెటిజన్లు.. ఘాటుగా బదులిచ్చిన అక్షయ్ భార్య

Webdunia
సోమవారం, 9 నవంబరు 2020 (12:27 IST)
సోషల్ మీడియాలో కొందరు నెటిజన్లు విజ్ఞత మరిచి ట్రోల్ చేయడం ఫ్యాషనైపోయింది. సెలెబ్రిటీలు, వారి కుటుంబాలను కూడా కొందరు నెటిజన్లు ఏకిపారేస్తున్నారు. ఇందుకు సోషల్ మీడియాను ఆయుధంగా మార్చేస్తున్నారు. తాజాగా అక్షయ్ కుమార్ భార్య ట్వింకిల్ ఖన్నా ఫొటోని మార్ఫింగ్ చేసి ఆ ఫోటోపై ట్వింకిల్ బాంబ్ అని రాసారు. ఇది ట్వింకిల్ ఖన్నా దృష్టికి రాగా, ట్రోలర్స్‌కు గట్టి సమాధానం ఇచ్చింది.
 
సౌత్‌లో మంచి హిట్ కొట్టిన కాంచన చిత్రం ఇప్పుడు హిందీలో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. ముందుగా ఈ చిత్రానికి లక్ష్మీ బాంబ్ అనే టైటిల్ ఫిక్స్ చేయగా, కొందరు దీనిపై రచ్చ చేయడంతో లక్ష్మీగా మార్చారు. అయినప్పటికీ దీనిపై ట్రోల్ నడుస్తూనే ఉంది. ఈ వివాదంలోకి అక్షయ్ భార్యని తీసుకొచ్చిన నెటిజన్స్ ట్వింకిల్ ఖన్నా ఫోటోని నీలి రంగులోకి మార్చి నుదుటున ఎర్రటి బొట్టు పెట్టారు.
 
ఈ ఫోటోను తన సోషల్ మీడియాలో షేర్ చేసిన అక్షయ్ భార్య.. ఈ ఫోటోకు నన్ను ట్యాగ్ చేసాడు ఓ థర్డ్ క్లాస్ పర్సన్. దేవుడి మీద జోకులు చేస్తారా అంటూ ప్రశ్నించారు. అవును మరీ, దేవుడికి జోకులంటే ఇష్టం కాబట్టే భూమి మీదకు నీలాంటోడిని పంపాడు. ఈ ఫొటో సాయంతో దీపావళికి పటాసులా రెడీ అవుతాను అంటూ తన కామెంట్ సెక్షన్‌లో రాసింది. ఈ కామెంట్ వైరల్‌గా మారింది. కాగా, నవంబర్ 9న ఓటీటీలో లక్ష్మీ చిత్రం విడుదల కానున్న సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పాకిస్థాన్‌‌తో క్రికెట్ ఆడటం మానేయాలి.. గాంధీ చేసినట్లు చేసివుంటే బాగుండేది?

Women: మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. జిల్లా సరిహద్దులు దాటి విస్తరిస్తుందా?

తమ్ముడికి సోకిన వ్యాధి బయటకు తెలిస్తే పరువు పోతుందనీ కడతేర్చిన అక్క

అమెరికాలో మళ్లీ పేలిన తుటా... గాల్లో కలిసిన ఐదుగురు ప్రాణాలు

ప్రియుడితో మాట్లాడుతోందని అక్కను మట్టుబెట్టిన తమ్ముడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments