Webdunia - Bharat's app for daily news and videos

Install App

మెగాస్టార్ చిరంజీవికి కరోనా.. సీఎం కేసీఆర్ పరిస్థితి ఏంటి? (Video)

Webdunia
సోమవారం, 9 నవంబరు 2020 (11:51 IST)
తెలుగు అగ్రహీరో మెగాస్టార్ చిరంజీవి కరోనా వైరస్ బారినపడ్డారు. తాను కరోనా వైరస్ బారినపడినట్టు ఆయన ధృవీకరించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఆయన "ఆచార్య" సినిమాలో నటించాల్సి ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో షూటింగులో పాల్గొనడం కోసం పరీక్ష చేయించుకోగా తనకు కరోనా సోకినట్లు తెలిసిందని ఆయన ట్వీట్ చేశారు.
 
'ఆచార్య షూటింగ్ ప్రారంభించాలని, కొవిడ్ టెస్ట్ చేయించుకున్నాను. రిజల్ట్ పాజిటివ్. నాకు ఎలాంటి కొవిడ్ లక్షణాలు లేవు. వెంటనే హోమ్ క్వారంటైన్ అయ్యాను. గత 4-5 రోజులుగా నన్ను కలిసినవారందరిని టెస్ట్ చేయించుకోవాలిసిందిగా కోరుతున్నాను. ఎప్పటికప్పుడు నా ఆరోగ్య పరిస్థితిని మీకు తెలియచేస్తాను’ అని చిరంజీవి ట్వీట్ చేశారు. కాగా, ఇటీవల చిరంజీవి తమ్ముడు నాగబాబు కూడా కరోనా నుంచి బయటపడ్డ విషయం తెలిసిందే.
 
ఇదిలావుంటే, చిరంజీవితో పాటు.. అక్కినేని నాగార్జున గత వారంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌తో సమావేశమయ్యారు. ఆ సమయంలో హైదరాబాద్ వరద సహాయ నిధి కోసం వారిద్దరూ ప్రకటించిన తమ వంతు విరాళాలను చెక్కుల రూపంలో అందజేశారు. పైగా, ముఖ్యమంత్రి కేసీఆర్‌తో వారు సమావేశమై వివిధ అంశాలపై చర్చించారు. ఈ నేపథ్యంలో చిరంజీవికి కరోనా వైరస్ సోకడంతో సీఎం కేసీఆర్ కూడా ఐసోలేషన్‌కు వెళ్లాల్సివుంది. పైగా, కోవిడ్ పరీక్షలు కూడా చేయించుకోవాల్సివుంది. అయితే, ఈ పరీక్షలు ఆయన చేయించుకుంటారో లేదో వేచి చూడాల్సిందే. 

 

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments