Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉదయాన్నే రాధిక ఆత్మహత్య వార్త విని బాధపడ్డా: రష్మీ గౌతమ్

యాంకర్ రాధికారెడ్డి ఆత్మహత్యపై జబర్దస్త్ యాంకర్, నటీమణి రష్మీ గౌతమ్ ఆవేదన వ్యక్తం చేసింది. వీ6 యాంకర్ రాధికారెడ్డి ఆత్మహత్య వార్తను ఉదయాన్నే వినడం, చూడటం బాధేసిందని రష్మీ గౌతమ్ చెప్పింది. రాధికను తాను

Webdunia
సోమవారం, 2 ఏప్రియల్ 2018 (16:35 IST)
యాంకర్ రాధికారెడ్డి ఆత్మహత్యపై జబర్దస్త్ యాంకర్, నటీమణి రష్మీ గౌతమ్ ఆవేదన వ్యక్తం చేసింది. వీ6 యాంకర్ రాధికారెడ్డి ఆత్మహత్య వార్తను ఉదయాన్నే వినడం, చూడటం బాధేసిందని రష్మీ గౌతమ్ చెప్పింది. రాధికను తాను కలవనప్పటికీ ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని చెప్పింది. ప్రస్తుతం డిప్రెషన్ అనేది అతిపెద్ద సమస్యగా పరిణమించిందని తెలిపింది. 
 
ఎప్పుడైనా అప్‌సెట్ అయితే స్నేహితులతో, కుటుంబ సభ్యులతో గడపాలని సూచించింది. ఆత్మహత్య చేసుకున్నంత మాత్రాన బాధలు తొలగిపోవని ట్వీట్ చేసింది. మెరుగైన జీవితాన్ని గడిపే అవకాశాన్ని ఆత్మహత్య దూరం చేస్తుందని తెలిపింది. 
 
మానసిక ఒత్తిడి గురించి ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని రష్మీ సూచించింది. రష్మీ ట్వీట్‌కు మరో ప్రముఖ యాంకర్ అనసూయ భరద్వాజ్ ఏకీభవించింది. మానసిక ఒత్తిడి అధిగమించేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అనసూయ తెలిపింది.
 
కాగా తెలుగు న్యూస్ ఛానల్ వీ6 కు చెందిన యాంకర్ రాధికారెడ్డి ఆపార్ట్ మెంట్ పై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డ సంగతి తెలిసిందే. "నా చావుకు ఎవరూ కారణం కాదు.. నా మెదడే నా శత్రువు. అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నా" అని రాధిక తన సూసైడ్ లేఖలో పేర్కొన్న సంగతి విదితమే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అతి త్వరలోనే ముంబై - అహ్మదాబాద్‌ల మధ్య బుల్లెట్ రైలు సేవలు

గడ్కరీ నివాసానికి బాంబు బెదిరింపు : క్షణాల్లో నిందితుడి అరెస్టు

ప్రకాశం జిల్లాలో పెళ్లిలో వింత ఆచారం.. (Video)

సరయూ కాలువలోకి దూసుకెళ్లి భక్తుల వాహనం - 11 మంది జలసమాధి

2 గంటల్లో తిరుమల శ్రీవారి దర్శనం - సాధ్యమేనా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments