Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వివాహేతర సంబంధం.. భార్యను, తల్లిని పక్కనబెట్టాడు.. చివరికి?

విశాఖపట్నం జిల్లా అనకాపల్లిలో అక్రమ సంబంధం బెడిసికొట్టడంతో సెల్ఫీ సూసైడ్ కలకలం రేపింది. విశాఖలోని అనకాపల్లిలో అక్రమ సంబంధం బెడిసికొట్టడంతో రాజశేఖర్ తీవ్ర మనస్థాపానికి గురై రైలు కిందపడి ఆత్మహత్య చేసుకు

Advertiesment
వివాహేతర సంబంధం.. భార్యను, తల్లిని పక్కనబెట్టాడు.. చివరికి?
, శనివారం, 31 మార్చి 2018 (12:42 IST)
విశాఖపట్నం జిల్లా అనకాపల్లిలో అక్రమ సంబంధం బెడిసికొట్టడంతో సెల్ఫీ సూసైడ్ కలకలం రేపింది. విశాఖలోని అనకాపల్లిలో అక్రమ సంబంధం బెడిసికొట్టడంతో రాజశేఖర్ తీవ్ర మనస్థాపానికి గురై రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు.

వివరాల్లోకి వెళితే.. అనకాపల్లికి చెందిన రాజశేఖర్‌కు ఐదేళ్ల క్రితమే వివాహమైంది. పెళ్లై ఐదేళ్లయినా పిల్లలు లేకపోవడంతో అశ్విని అనే యువతితో అతనికి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. 
 
అయితే అప్పటికే అశ్వినికి పెళ్లైంది. ఓ పాప కూడా ఉంది. అయినా వీరిద్దరి బంధం వివాహంతో ఒక్కటైంది. కొంత కాలం వీరిద్దరూ అన్యోన్యంగా జీవించినా అంతే స్పీడ్‌తో బెడిసికొట్టింది. ఈ క్రమంలో తనకు జన్మినిచ్చిన తల్లిని.. తాళ్లికట్టిన భార్యను పూర్తిగా నిర్లక్ష్యం చేసిన రాజశేఖర్.. పూర్తిగా ఇంటికెళ్లడం మానేశాడు. 
 
ఒకనొక సమయంలో ఎందుకు ఇంటికి రావట్లేదని తల్లి, భార్య, మేనమామ నిలదీశారు. అయితే వారితో దురుసుగా వ్యవహరించి గొడపవపడి మరీ అశ్వినీ దగ్గరికే వెళ్లిపోయాడు. కానీ అశ్వినితోనే రాజశేఖర్ వుంటున్నా.. ఆమె ప్రవర్తనలో మార్పు వచ్చింది. అశ్విని వేరొకరితో తరుచుగా ఫోన్‌లో మాట్లాడుతుండటంతో అనుమానం పెంచుకున్నాడు. 
 
ఆమెపై ఆంక్షలు విధించడంతో ఎదురుతిరిగిన అశ్వని ప్లేట్ మార్చేసి పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది. తాళికట్టిన ప్రియుడిపై ఫిర్యాదు చేయడంతో తీవ్ర మనస్తాపానికి గురైన రాజశేఖర్ ఆత్మహత్య చేసుకున్నాడు.

ఆత్మహత్యకు ముందు సెల్ఫీ వీడియోలో జరిగిందంతా చెబుతూ ఆవేదనతో తన మిత్రులకు వాట్సాప్‌లో వీడియో షేర్ చేసి రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బతకడం ఇష్టంలేకే చనిపోతున్నానని ఆ సెల్ఫీ వీడియోలో చెప్పాడు. అమ్మను, భార్యను క్షమించాల్సిందిగా కోరాడు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

''భరత్ అనే నేను'': మహేష్ కోసం పాటపాడిన బాలీవుడ్ హీరో.. ఎవరో తెలుసా?