Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

"భలే మంచి చౌక బేరమ్" అంటున్న దర్శకుడు మారుతి (Video)

'భ‌లే భ‌లే మ‌గాడివోయ్' చిత్రం తర్వాత దర్శకుడు మారుతి తీస్తున్న చిత్రం "భలే మంచి చౌక బేరమ్". నిజానికి మార్చి 29వ తేదీన మారుతి త‌న టీమ్‌తో క‌లిసి కొత్త ప్ర‌య‌త్నం చేయ‌బోతున్న‌ట్టు ఓ పోస్ట‌ర్ ద్వారా తెలి

Advertiesment
, శుక్రవారం, 30 మార్చి 2018 (16:20 IST)
'భ‌లే భ‌లే మ‌గాడివోయ్' చిత్రం తర్వాత దర్శకుడు మారుతి తీస్తున్న చిత్రం "భలే మంచి చౌక బేరమ్". నిజానికి మార్చి 29వ తేదీన మారుతి త‌న టీమ్‌తో క‌లిసి కొత్త ప్ర‌య‌త్నం చేయ‌బోతున్న‌ట్టు ఓ పోస్ట‌ర్ ద్వారా తెలిపాడు. పోస్ట‌ర్ మొత్తం కరెన్సీ కనిపిస్తుండటం వలన, ఇది డబ్బుకు సంబంధించిన స్టోరీ కావొచ్చని అభిమానులు భావించారు.
 
అయితే శుక్రవారం (మార్చి-30) ఈ మూవీకి "భలే మంచి చౌక బేరమ్" అనే టైటిల్ ఫిక్స్ చేసి, ఫ‌స్ట్ లుక్ మోష‌న్ పోస్ట‌ర్ విడుద‌ల చేశారు. మారుతి అండ్ టీం కాన్సెప్ట్‌తో రూపొంద‌నున్న ఈ సినిమాను ప్ర‌సాద్ అరోల్లా, గుడ్ సినిమా గ్రూప్ సంయుక్తంగా నిర్మించ‌నున్నాయి. మార్చి 31న  ట్రైల‌ర్ విడుద‌ల చేయ‌నున్నారు. 
 
ఈ చిత్రంలో న‌వీద్‌, పార్వ‌తీశం ముఖ్య పాత్ర‌లుగా భ‌లే మంచి చౌక బేరమ్ రూపొందుతుంది. కాగా, మారుతి దర్శకత్వంలో అక్కినేని నాగచైతన్య హీరోగా 'శైలజా రెడ్డి అల్లుడు' చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీలో రమ్య‌కృష్ణ ముఖ్య పాత్ర‌లో క‌నిపించ‌నుంది. 

 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వ్యభిచారం చేస్తున్న తమిళ నటి... పోలీసులకు పట్టించిన ప్రజలు