Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పక్క వ్యక్తి కూడా పైకి రావాలని కోరుకునే వ్యక్తి ప్రభాస్ : శర్వానంద్

పక్క వ్యక్తి కూడా పైకి రావాలని కోరుకునే వ్యక్తుల్లో మొదటి వ్యక్తి హీరో ప్రభాస్‌ అని యువ హీరో శర్వానంద్ చెప్పుకొచ్చాడు. ఆయన తాజాగా నటించిన చిత్రం మహానుభావుడు. ఈ చిత్రం ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్‌లో జర

Advertiesment
Mahanubhavudu Pre-Release Function
, సోమవారం, 25 సెప్టెంబరు 2017 (07:28 IST)
పక్క వ్యక్తి కూడా పైకి రావాలని కోరుకునే వ్యక్తుల్లో మొదటి వ్యక్తి హీరో ప్రభాస్‌ అని యువ హీరో శర్వానంద్ చెప్పుకొచ్చాడు. ఆయన తాజాగా నటించిన చిత్రం మహానుభావుడు. ఈ చిత్రం ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా శర్వానంద్ మాట్లాడుతూ... 'ఈ సినిమాలో నేను ‘మహానుభావుడు’ అయితే రియల్‌ లైఫ్‌లో మహానుభావుడు ప్రభాస్‌ అన్న. ఈ విషయాన్ని నేను మనస్ఫూర్తిగా చెబుతున్నా. మనల్ని ప్రేమించే వాళ్లు నలుగురు బెస్ట్‌ ఫ్రెండ్స్‌ ఉంటారు. అలాంటి బెస్ట్‌ ఫ్రెండ్స్‌ ప్రభాస్‌కు పాతిక మంది ఉన్నారు. దీనిని బట్టే మనం అర్థం చేసుకోవచ్చన్నారు. 
 
తనకు ప్రేమను ఇవ్వడమే తప్ప వేరేది తెలియదని. నా సినిమా ఎప్పుడు రిలీజ్‌ అయినా, ఎక్కువ టెన్షన్‌ పడేది ప్రభాస్‌ అన్న. నేను 'రన్‌ రాజా రన్' చేసినప్పుడు పిలిచి 'హిట్‌ కొట్టాం రా ఎంజాయ్‌ చెయ్‌' అన్నాడు. పక్క వ్యక్తి కూడా పైకి రావాలని కోరుకునే వ్యక్తుల్లో మొదటి వ్యక్తి ప్రభాస్‌. మాకు చాలా సహకారం అందించినందుకు ధన్యవాదాలు. సినిమాను చూసి ఖచ్చితంగా ఎంజాయ్‌ చేస్తారు. చాలా రోజుల తర్వాత నేను మనస్ఫూర్తిగా చేసిన సినిమా ఇది. మా చిత్ర బృందానికి ధన్యవాదాలు' అంటూ వ్యాఖ్యానించారు. 
 
ఇకపోతే.. చిత్ర దర్శకుడు మారుతి మాట్లాడుతూ.. వంశీ, ప్రమోద్‌లతో నాకు జీవితాంతం గుర్తిండిపోయే స్నేహితులు దొరికారు. మంచి సినిమా తీయాలని మేం అనుకున్నప్పుడు హీరోగా శర్వాను తీసుకున్నాం. నిజంగా శర్వా ఈ చిత్రానికి ప్రాణం పోశాడు. కొత్త శర్వాను చూస్తారు. నేను ఈ మాట చాలా తక్కువ మందికి అంటాను. ‘భలే భలే మగాడివోయ్‌’కి నానికి ఎంత ఎగ్జైట్‌ అయ్యానో ఇప్పుడు అంతకు డబుల్‌ ఎగ్జైట్‌ అవుతున్నా. ప్రతి టెక్నీషియన్‌ చాలా కష్టపడి పనిచేశారు. నేను రాసుకున్న కథకు అందరూ వచ్చి ప్రాణం పోశారు. చాలా ఎంజాయ్‌ చేస్తారు. దసరాకు ఒక రోజు ముందుగానే వస్తున్నాం అంటూ చెప్పుకొచ్చారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శర్వా మా ఇంటి హీరో.. రేపటి సూపర్‌స్టార్‌: ప్రభాస్‌ రాజు