Webdunia - Bharat's app for daily news and videos

Install App

హీరో మాధవన్ ఫోటో.. ముందు జంద్యం, తిరునామం, వెనుక శిలువ?

Webdunia
శనివారం, 17 ఆగస్టు 2019 (14:06 IST)
హీరో మాధవన్ వార్తల్లో నిలిచాడు. రాఖీ పండుగ సందర్భంగా తన తండ్రి, కొడుకుతో దిగిన ఫోటోలను ట్విట్టర్‌లో షేర్ చేయడం ద్వారా ఆయనపై మతవాదులు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే? రాఖీ పండుగ సందర్భంగా మాధవన్ జంద్యంతో సంప్రదాయ హిందువులా కనిపించారు. కానీ ఆ ఫోటో వెనుక ఓ శిలువ వుండటాన్ని ఓ మహిళ తప్పుబట్టింది. 
 
"మీ పూజ గదిలో శిలువ ఎందుకు ఉంది? మీరు మతం పరువు తీశారు. మీపై ఉన్న గౌరవం పోయింది. చర్చిల్లో హిందూ దేవుళ్లు కనిపించరు... కానీ హిందువైన మీ ఇంట్లో శిలువ ఉండటం నాకు నచ్చలేదు. మీరు హిందూ సాంప్రదాయాల్ని ఆచరిస్తున్నారన్నది అబద్ధం. ఈ ఫొటో ఫేక్" అని జిక్సా అనే మహిళా నెటిజన్ ఫైర్ అయ్యింది.
 
ఇందుకు మాధవన్ ఘాటుగా బదులిచ్చాడు. ముందు మీకు పట్టిన రోగం త్వరలో నయం కావాలనుకుంటున్నానని చెప్పాడు. మీలాంటి వాళ్లు గౌరవించకపోయినా తనకు నష్టమూ లేదు. తనకు అన్ని మతాలూ సమానమే. అన్ని మతాల్నీ మా కుటుంబం విశ్వసిస్తుంది. 
 
హిందూ, ముస్లిం, సిక్కు, క్రిస్టియన్ అని కాదు. ప్రతి మతానికి మా ఇంట్లో ప్రవేశం ఉంది. మీకు కనిపించలేదనుకుంటా.. ఆ ఫొటోలో గోల్డెన్‌ టెంపుల్‌ కూడా ఉంది. గుడి, చర్చ్, దర్గా... దేనికైనా వెళ్లడం మంచి అవకాశంగా భావిస్తా. ఎందుకంటే నాకు మీకున్న జబ్బు నాకు లేదు" అంటూ ఆమెకు షాకింగ్ కౌంటర్ ఇచ్చాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Crime: భార్యాపిల్లలను బావిలో తోసి హతమార్చేసిన భర్త

జనరేటివ్ ఏఐ, కంప్యూటేషనల్ ఇంటెలిజెన్స్‌పై కెఎల్‌హెచ్ బాచుపల్లి అంతర్జాతీయ సదస్సు

Praja Darbar: నారా లోకేష్ ప్రజా దర్బార్.. రాజభాస్కర రెడ్డి చేసిన రూ1.77 కోట్ల మోసం గురించి..?

బీఆర్ఎస్ నేతలు ఎప్పటికైనా తన దారికి రావాల్సిందే : కె.కవిత

Telangana: పోలీసుల ఎదుట లొంగిపోయిన సీపీఐ మావోయిస్ట్ పార్టీ నేతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments