Webdunia - Bharat's app for daily news and videos

Install App

#Maharshi నుంచి Deleted Scene 1 (వీడియో)

Maharshi
Webdunia
శనివారం, 17 ఆగస్టు 2019 (13:07 IST)
టాలీవుడ్ ప్రిన్స్, సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ''మహర్షి'' చిత్రం కలెక్షన్ల వర్షం కురిపించింది. సందేశాత్మకంగా వేసవిలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బంపర్ హిట్ అయ్యింది. తద్వారా మహర్షి చిత్రం మహేష్ కెరీర్‌లో హైయెస్ట్ గ్రాసర్‌గా నిలిచింది. వంశీ పైడిపల్లి తెరకెక్కించిన ఈ చిత్రంలో మహేష్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించింది. అల్లరి నరేష్ కీలక పాత్రలో కనిపించాడు. 
 
ఇటీవలే ఈ సినిమా వంద రోజులను పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా మహర్షి సినిమా యూనిట్ అభిమానులకు సర్‌ప్రైజ్ ఇచ్చింది. మహర్షి చిత్రంలోని డీలిటెడ్ సన్నివేశాన్ని విడుదల చేశారు. ఈ సన్నివేశం ఆసక్తికరంగా ఉంది. నటుడు కమల్ కామరాజు ఈ చిత్రంలో నెగిటివ్ రోల్ లో నటించాడు. మహేష్, పూజా హెగ్డే వెళుతుండగా కమల్ కావాలనే కాలు అడ్డుపెడతాడు. 
 
దీనితో మహేష్ బాబు పూజాని క్లాస్‌కి పంపించి అతడితో మాట్లాడడానికి కూర్చుంటాడు. రెండు ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసి, అమ్మాయితో తిరగ్గానే హీరో అనుకుంటున్నావా? అని మహేష్‌ని ప్రశ్నిస్తాడు. 'హీరో అనుకోవడం ఏంటి.. హీరోనే కదా' అని మహేష్ బదులిస్తాడు. ఆ తర్వాత వీరిద్దరి మధ్య చిన్న ఫైట్ సన్నివేశం చోటుచేసుకుంటుంది. ఈ సీన్‌ను చూసిన మహేష్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నాడు. ఈ సన్నివేశాన్ని మీరూ ఓ లుక్కేయండి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Telangana: 5.80 కిలోల గంజాయి చాక్లెట్ల స్వాధీనం-నిందితుడి అరెస్టు

ప్లీజ్.. చంపొద్దంటూ వేడుకున్నా కనికరించలేదు .. విశాఖ వాసిని వెంటాడి.. వేటాడి కాల్చేశారు...

ఆరోగ్య సమస్యల్ని పరిష్కరిస్తానని రూ.9.8లక్షల మోసం- లేడీ అఘోరి అరెస్ట్

జత్వానీ కేసులో పీఎస్ఆర్ ఆంజనేయలు అరెస్టు - నేడు కోర్టులో హాజరు

Pahalgam Terrorist Attack, తెలంగాణ వాసి మనీష్ రంజన్ మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

ఐపిఎల్ సీజన్‌ వేళ, బలం- శక్తి కోసం కాలిఫోర్నియా బాదం పప్పును తినండి

ఉదయాన్నే వరెస్ట్ బ్రేక్ ఫాస్ట్ తీసుకుంటున్నారా?

తర్వాతి కథనం
Show comments