Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కాశ్మీర్‌‍లో క్రికెట్ ఆడిన ప్రిన్స్.. గౌతమ్ అవుట్ చేశాడని ఎమోజీలు (వీడియో)

Advertiesment
కాశ్మీర్‌‍లో క్రికెట్ ఆడిన ప్రిన్స్.. గౌతమ్ అవుట్ చేశాడని ఎమోజీలు (వీడియో)
, ఆదివారం, 11 ఆగస్టు 2019 (13:59 IST)
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం కాశ్మీర్‌లో వున్నారు. తాజాగా ''సరిలేరు నీకెవ్వరు'' మూవీలో మహేష్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ''సరిలేరు నీకెవ్వరు'' సినిమాలో రష్మిక మందనా హీరోయిన్. ప్రకాశ్‌రాజ్‌, విజయశాంతి, నరేశ్‌, రమ్యకృష్ణ, రాజేంద్ర ప్రసాద్‌ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.


దేవిశ్రీ ప్రసాద్‌ మ్యూజిక్ అందిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.
 
ఈ నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించిన కాశ్మీర్‌‌ షెడ్యూల్‌ ఇటీవలే పూర్తయింది. దీంతో అక్కడ సరిలేరు నీకెవ్వరు సినిమా టీమ్ మస్తుగా ఎంజాయ్ చేస్తున్నారు. బ్రేక్ టైమ్‌లో అందరూ కలిసి సరదాగా క్రికెట్‌ ఆడారు. అలా టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్‌బాబుతో పాటు ఆయన కుమారుడు గౌతమ్‌, దర్శకుడు వంశీ పైడిపల్లితో కలిసి క్రికెట్‌ ఆడిన వీడియోను దర్శకుడు అనిల్‌ రావిపూడి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. 
 
మహేశ్‌, గౌతమ్‌, వంశీ, మెహర్‌ రమేశ్‌తో సరదాగా గడిపినట్లు చెప్పుకొచ్చాడు. ''గౌతమ్‌ నన్ను అవుట్‌ చేశాడు" అంటూ ఏడుస్తున్న ఎమోజీలను పోస్ట్‌ చేశారు. ప్రస్తుతం ఈ  వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోను మీరూ ఓ లుక్కేయండి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆండ్రియా పెళ్లైన వ్యక్తితో ఆ పని చేసిందట.. కానీ ఆయన పేరు మాత్రం చెప్పలేదు..