Webdunia - Bharat's app for daily news and videos

Install App

త్రిషతో రేప్ సీన్ ఉంటుందని భావించా.. ప్చ్... మన్సూర్ అలీ ఖాన్

Webdunia
ఆదివారం, 19 నవంబరు 2023 (10:07 IST)
తమిళ నటుడు మన్సూర్ అలీ ఖాన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. స్టార్ హీరోయిన్ త్రిషను ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. విజయ్ నటించిన లియో చిత్రంలో త్రిషతో రేప్ సీన్ ఉంటుందని భావించానని, కానీ ఆమెను కనీసం చూపించను కూడా లేదని చెప్పారు. ఈ విషయాన్ని లియో సక్సెస్ వేడుకల్లోనే మాట్లాడాలని భావించానని, కానీ, వివాదమవుతుందని భావించి మిన్నకుండిపోయానని తెలిపారు. ఇటీవల చెన్నై నుంగంబాక్కంలోని ఆయన నివాసంలో మన్సూర్ అలీ ఖాన్ విలేకరులతో మాట్లాడుతూ, త్రిష గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 
 
మరోవైపు, ఈ కోలీవుడ్ యాక్టర్ వ్యాఖ్యలకు త్రిష గట్టిగానే కౌంటరిచ్చింది. అతడితో నటించే అవకాశం ఇంతవరకూ రానందుకు తను దేవుడికి రుణపడి ఉన్నానంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకపై ఎప్పటికీ అతడితో నటించనని తెగేసి చెప్పింది. 
 
కాగా, విజయ్, త్రిష కాంబినేషన్ ఇటీవల వచ్చిన మూవీ 'లియో'లో మన్సూర్ అలీ ఖాన్ ఓ పాత్ర పోషించాడు. ఈ నేపథ్యంలో ఇటీవల రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులు, తాను నిర్మిస్తున్న "సరక్కు" తమిళ చిత్రం విశేషాలను వెల్లడించేందుకు ఆయన విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఆ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు.
 
ఈ మీడియా సమావేశంలో త్రిషను ఉద్దేశించి నోటికొచ్చినట్టు మాట్లాడాడు. 'నేను త్రిషతో నటిస్తున్నానని విన్నప్పుడు, సినిమాలో బెడ్రూం సన్నివేశం ఉంటుందని అనుకున్నా. ఆమెను చేతులతో ఎత్తుకుని బెడ్రూంలోకి తీసుకెళ్లొచ్చని భావించాను. నేను గతంలో చాలా సార్లు రేప్ సీన్లు చేశాను. ఇది నాకు కొత్తకాదు. అయితే, లియో కాశ్మీర్ షెడ్యూల్ సెట్స్‌లో త్రిషను నాకు చూపించనే లేదు' అంటూ వెకిలి కామెంట్స్ చేశాడు.
 
దీనిపై త్రిష మండిపడింది. 'మన్సూర్ అలీ ఖాన్ నాపై చెత్త వ్యాఖ్యలు చేసిన వీడియో ఒకటి నా దృష్టికి వచ్చింది. నేను అతడి వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నా. అతడి కామెంట్స్‌లో స్త్రీలపై వివక్ష, ద్వేషం, పురుష దురహంకారం కనిపిస్తున్నాయి. ఇలాంటి చెత్త వ్యక్తితో ఎప్పటికీ నటించను' అని త్రిష గట్టిగా కౌంటర్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ వివాదం కోలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆపరేషన్‌ బుడమేరు: విజయవాడను వరద ముంపు నుంచి తప్పించే ఈ ప్రాజెక్ట్ ఎప్పటికి పూర్తవుతుంది, ఆక్రమణల మాటేంటి?

మహారాష్ట్ర సీఎం అభ్యర్థిపై ఎంపికపై వీడని ఉత్కంఠ - హస్తినకు ఆ ముగ్గురు నేతలు

మెట్టు దిగిన ఏక్‌నాథ్ షిండే.. బీజేపీ అధిష్టానం నిర్ణయమే శిరోధార్యం

హిందూ - ముస్లింల మధ్య చిచ్చు పెట్టడానికి బీజేపీ కుట్ర : రాహుల్ గాంధీ

ప్రధానితో పవన్ కల్యాణ్ భేటీ.. పార్లమెంట్ సమావేశాల మధ్య...?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments