Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

విజయ్, లోకేష్ కనగరాజ్ టైటిల్ లియో - కాశ్మీర్ షెడ్యూల్ ప్రారంభం

vijay-leo
, శనివారం, 4 ఫిబ్రవరి 2023 (13:50 IST)
vijay-leo
దళపతి విజయ్ 67, లోకేష్ కనగరాజ్ ల క్రేజీ ప్రాజెక్ట్ కాస్టింగ్, సాంకేతిక ప్రమాణాలు, నిర్మాణ విలువల పరంగా భారీగా ఉండబోతోంది. దలపతి67లో సంజయ్ దత్, త్రిష,  ప్రియా ఆనంద్, అర్జున్ సర్జా, గౌతమ్ మీనన్, మిస్కిన్, మన్సూర్ అలీ ఖాన్, మాథ్యూ థామస్ , శాండీ మాస్టర్ వంటి ప్రముఖ తారాగణం అలరించబోతోంది.  
 
తాజాగా ఈ చిత్రానికి టైటిల్ ఖరారు చేశారు మేకర్స్. #దలపతి 67 కి ‘లియో’ అనే ఇంట్రస్టింగ్ టైటిల్ ని అనౌన్స్ చేశారు.  అలాగే ఈ చిత్రం కాశ్మీర్ షెడ్యూల్ ప్రారంభమైయింది. ఈ షెడ్యూల్ విజయ్, త్రిషలతో పాటు ఈ చిత్రంలో ముఖ్యమైన పాత్రదారులపై కీలక సన్నివేశాలని చిత్రీకరించనున్నారు. 7 స్క్రీన్ స్టూడియో పతాకంపై ఎస్ ఎస్ లలిత్ కుమార్ ఈ చిత్రాన్ని భారీ నిర్మిస్తుండగా, జగదీష్ పళనిసామి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
 
ఈ చిత్రానికి రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తుండగా, మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఫిలోమిన్ రాజ్ ఎడిటింగ్, ఎన్. సతీస్ కుమార్ ఆర్ట్ డైరెక్టర్. రామ్‌కుమార్ బాలసుబ్రమణియన్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్.
 
'దలపతి 67' నటీనటులు, టీంకి  సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో తెలియజేస్తారు.
 
తారాగణం:  విజయ్, త్రిష కృష్ణన్, సంజయ్ దత్, ప్రియా ఆనంద్, అర్జున్ సర్జా, గౌతమ్ మీనన్, మిస్కిన్, మన్సూర్ అలీ ఖాన్, మాథ్యూ థామస్, శాండీ మాస్టర్ 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ముగ్గురు పోలిన మ‌నుషుల క‌థ‌ అమిగోస్ : నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్‌