Webdunia - Bharat's app for daily news and videos

Install App

త్రినాథరావు నక్కిన నిర్మాణంలో చౌర్య పాఠం రిలీజ్ డేట్ ఫిక్స్

దేవి
మంగళవారం, 11 మార్చి 2025 (16:37 IST)
Chaurya Patham poster
డైరెక్టర్ త్రినాథరావు నక్కిన తన అప్ కమింగ్ క్రైమ్-కామెడీ డ్రామా 'చౌర్య పాఠం'తో మూవీ ప్రొడక్షన్ అడుగుపెడుతున్నారు. ఇంద్రా రామ్‌ను హీరోగా పరిచయం చేస్తున్నారు. కార్తికేయ -2 మొదలైన చిత్రాలకు చందూ మొండేటి వద్ద అసోసియేట్ డైరెక్టర్‌గా పని చేసిన నిఖిల్ గొల్లమారి ఈ మూవీతో దర్శకునిగా పరిచయం అవుతున్నారు.
 
నక్కిన నెరేటివ్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ మూవీకి వి చూడమణి సహ నిర్మాత. ఈ చిత్రం టీజర్ థ్రిల్లింగ్ క్రైమ్, డార్క్ హ్యూమర్ బ్లెండ్ తో ఇప్పటికే బజ్ క్రియేట్ చేసింది. నాగ చైతన్య లాంచ్ చేసిన ప్రమోషనల్ సాంగ్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.
 
సమ్మర్ లో వన్ అఫ్ ది బిగ్గెస్ట్ అట్రాక్షన్ గా 'చౌర్య పాఠం' ఏప్రిల్ 18న థియేటర్లలోకి వస్తుందని మేకర్స్ అనౌన్స్ చేశారు. పరీక్షలు ముగిసి, వేసవి సెలవులు ప్రారంభమౌతున్నందున ఈరిలీజ్ డేట్ పాఠశాల, కళాశాల విద్యార్థులకు పర్ఫెక్ట్ టైం. వినోదాన్ని ఆస్వాదించాలనుకునే స్నేహితులకు ఈ మూవీ ఒక సరదా ప్రయాణంగా ఉంటుంది. లీడ్ యాక్టర్స్ వారి ముఖాలను రహస్యంగా కప్పి ఉంచిన రిలీజ్ పోస్టర్ ఆసక్తిని మరింత పెంచుతుంది.
 
ఈ చిత్రంలో పాయల్ రాధాకృష్ణ కథానాయికగా నటిస్తుండగా, రాజీవ్ కనకాల, మస్త్ అలీ ముఖ్యమైన కీలక పాత్రలను పోషిస్తున్నారు. ఈ చిత్రంలో మరో బిగ్గెస్ట్ ఎట్రాక్షన్ ఈ కథను సినిమాటోగ్రాఫర్ కార్తీక్ ఘట్టమనేని రాశారు. అతను కెమెరా వర్క్ కూడా నిర్వహిస్తున్నారు. దావ్‌జాంద్ మ్యూజిక్ అందిస్తున్నారు.  హనుమాన్ ఫేమ్ శ్రీ నాగేంద్ర తంగాల ప్రొడక్షన్ డిజైనర్‌. ఉతుర ఎడిటింగ్ విధులను నిర్వహిస్తున్నారు.
 
తారాగణం: ఇంద్ర రామ్, పాయల్ రాధాకృష్ణ, రాజీవ్ కనకాల, మస్త్ అలీ, మాడి మానేపల్లి, అంజి వల్గుమాన్, ఎడ్వర్డ్ పెరేజీ, సుప్రియ ఐసోలా, క్రీష్ రాజ్, సహదేవ్
సాంకేతిక సిబ్బంది:

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కిడ్నాప్ కేసులో వల్లభనేని వంశీకి షాక్ : 25 వరకు జైల్లోనే...

ఔటర్ రింగ్ రోడ్డు టు ఇబ్రహీంపట్నం, ప్రేమజంటల రాసలీలలు, దోపిడీ దొంగతనాలు

మోసం చేయడమంటే ఇదేనేమో ... కూటమి సర్కారుపై వైఎస్.షర్మిల ధ్వజం

Goods train hits ambulance: అంబులెన్స్‌ను ఢీకొన్న గూడ్స్ రైలు.. ఎవరికి ఏమైంది..?

రైలు కిటికి పట్టుకుని వేలాడుతూ రీల్స్ చేసిన యువకుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అల్లంతో 5 అద్భుత ప్రయోజనాలు, ఏంటవి?

కాలిఫోర్నియా బాదంతో ఈ హోలీని ఆరోగ్యకరంగా, ప్రత్యేకంగా చేసుకోండి

వేసవిలో సబ్జా వాటర్ ఆరోగ్య ప్రయోజనాలు

Extra Marital Affair: వివాహేతర సంబంధాలకు కారణాలు ఏంటి? సైకలాజిస్టులు ఏం చెప్తున్నారు?

హైదరాబాద్‌లో అకింత్ వెల్‌నెస్ సెంటర్ 'అంకితం' ప్రారంభం

తర్వాతి కథనం
Show comments