ప్రభాస్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన "బాహుబలి-2" చిత్రం హిందీలో నెలకొల్పిన రికార్డు మాయమైపోయింది. గత నెల 14వ తేదీన విడుదలైన "ఛావా" చిత్రం ఈ రికార్డును అధిగమించింది. "బాహుబలి-2" చిత్రం బాలీవుడ్‌లో రూ.510 కోట్ల మేరకు వసూళ్లను రాబట్టింది.
అయితే, "ఛావా" చిత్రం విడుదలైన 25 రోజుల్లోనే రూ.516 కోట్లు వసూలు చేసి సరికొత్త రికార్డును నెలకొల్పింది. లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో విక్కీ కౌశల్ ఛత్రపతి శివాజీ తనయుడు శంభాజీ మహరాజ్ పాత్రలో జీవించాడు. రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటించారు. ఈ చారిత్రాత్మక చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకుల ప్రశంసలు, ఆదరణ దక్కించుకుని విజయవంతంగా ప్రదర్శితమవుతుంది.
కాగా, "ఛావా" చిత్రం తాజాగా "బాహుబలి-2" రికార్డును క్రాస్ చేసింది. "బాహుబలి-2" కలెక్ట్ చేసిన రూ.510 కోట్లను "ఛావా" చిత్రం కేవలం 25 రోజుల్లోనే రూ.516 కోట్లు వసూలు చేసి సరికొత్త రికార్డును నెలకొల్పడం గమనార్హం. ఈ చిత్రం ఓవరాల్‌గా బాలీవుడ్‌లో అత్యధిక వసూళ్లను రాబట్టిన చిత్రాల్లో ఆరో స్థానంలో నిలిచింది.