Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ల్యాంప్ సినిమా నచ్చి డిస్ట్రిబ్యూటర్లే రిలీజ్ చేయడం సక్సెస్‌గా భావిస్తున్నాం

Advertiesment
Lamp -, Vinod Nuvula

దేవి

, మంగళవారం, 11 మార్చి 2025 (15:38 IST)
Lamp -, Vinod Nuvula
సినిమా గ్రాఫిక్స్ వర్క్ వల్ల కొంచెం లేట్ అయింది కానీ థియేటర్స్ లోనే రిలీజ్ చేయాలని ఉద్దేశంతో మేము చాలా చక్కగా సినిమాని తయారు చేశాం. ఇప్పుడు 150 థియేటర్లో సినిమా రిలీజ్ కాబోతుంది. మా ట్రైలర్ సినిమా నచ్చి డిస్ట్రిబ్యూటర్లే రిలీజ్ చేస్తా అన్నారు ఇది మాకు చాలా సంతోషకరమైన విషయం. మార్చి 14 తారీఖున మా ల్యాంప్ సినిమా అన్ని థియేటర్లలో విడుదల చేస్తున్నాం అని  లాంప్ సినిమా ప్రధానపాత్రధారి వినోద్ నువ్వుల సినిమా గురించి పలు విషయాలు తెలిపారు. 
 
- మా లాంప్ సినిమా ఒక క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్. వరుస హత్యలు జరుగుతున్న నేపథ్యంలో వాటిని ఛేదించే క్రమంలో హీరో ఎలా ట్రావెల్ అయ్యాడు కామెడీగా దీన్ని చూపిస్తూ ఫైనల్‌గా అసలు ఏం జరిగింది? ఎలా వాటిని ఆపాడు అనేది స్టోరీ. ఈ చిత్రంలో నేను ఒక కానిస్టేబుల్‌గా ఉండి ఆ కేసులను పట్టుకొని ఫైనల్‌గా ఇన్స్పెక్టర్ అవడం నా పాత్ర. సస్పెన్స్ మెయింటైన్ చేస్తూనే కామెడీ పండించడం నా పాత్ర హైలెట్.
 
-  అందరికీ అందుబాటులో ఉండాలన్న ఉద్దేశంతో సినిమా టికెట్ ధరలను 110 రూపాయలుగా నిర్ణయించారు. మీరు పెట్టిన 110 రూపాయలకి రెండు వందల పది రూపాయల ఎంటర్టైన్మెంట్ మేము అందిస్తామని గ్యారెంటీ ఇస్తున్నాం. తప్పకుండా దీంట్లో కామెడీ ఉంటుంది రొమాన్స్ ఉంటుంది మంచి సాంగ్స్ ఉన్నాయి ఫైట్స్ ఉన్నాయి.
 
- మా సినిమా ప్రొడ్యూసర్స్ ఏడు చేపల కథ అనే సినిమాకి నిర్మాతలు. ఇందులో నాతో పాటు హీరోయిన్ మధుప్రియ, కోటి కిరణ్, అవంతిక వెంకీ నాగేంద్ర, చలపతి, సౌమ్య, నాగరాజు నటించారు.
 
- వినోద్ ఫిల్మ్ అకాడమీ స్థాపన గురించి చెప్పాలంటే, ఇప్పుడు చాలామంది స్టూడెంట్స్ సినిమాల్లో నటించాలని వచ్చి మోసపోతున్నారు .ఏమీ నేర్చుకోకుండా వచ్చి ఇబ్బందులు పడే కంటే మా దగ్గర నేర్చుకుని వాళ్ళు మా గైడెన్స్ లో వెళ్లడం ద్వారా వాళ్ళు సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. టైం సేవ్ అవుతుంది మనీ కూడా సేవ్ అవుతుంది రిస్కు కూడా తగ్గుతుంది.
 
- మా అకాడమీలో యాక్టింగ్ నేర్చుకున్న విద్యార్థులకు మేమే అవకాశాలు చూపించి వాళ్ళు కట్టిన ఫీజు మళ్ళీ రెమ్యూనరేషన్ రూపంలో వాళ్ళు సంపాదించుకునే అంత గ్యారెంటీ ఇస్తూ ఉంటాం. కొంతమంది స్టూడెంట్స్ మేము ఫీజు కడితే చాలు నేర్చుకోకుండానే మాకు ఇప్పిస్తారా అని చెప్పి అడుగుతా ఉంటారు అలా కుదరదు అని చెప్తా. 
 
- ప్రేక్షకులు ఎప్పటికప్పుడు కొత్తదనాన్ని కోరుకుంటు ఉంటారు. ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా కొత్త రకంగా నటించే నేను, కొత్తగా నటించాలనుకునే యువతీయువకుల్ని ప్రోత్సహిస్తూ ఉంటాను. కొత్తగా సినిమా తీయాలనుకునే యువ దర్శకులు, ప్రొడ్యూసర్స్‌కి సహకారం అందించడం కోసం మా అకాడమీ నుంచి స్టూడెంట్స్‌ని కూడా వాళ్ళకి సపోర్ట్‌గా ఆర్టిస్టులుగా ఇస్తూ ఉంటాను.
 
- ప్రస్తుతం నేను చేసిన బార్బరీక్ సినిమా రెడీగా ఉంది. అలాగే, శాసనమా చట్టమా! అనే సినిమాలో హీరో సుమన్ గారి కొడుకు క్యారెక్టర్ చేస్తున్నాను. అంతేకాకుండా డైరెక్టర్ హర్ష, డైరెక్టర్ తల్లాడ సాయి కృష్ణ గారి కాంబినేషన్లో రెండు సినిమాల్లో లీడ్ గా నటిస్తూన్నాను.
 
- నటుడుగా సినిమాలు వెబ్ సిరీస్‌లు రంగస్థలంలో విభిన్నమైన పాత్రలు చేయడానికి నేనెప్పుడూ రెడీ. నిర్మాతగా షార్ట్ ఫిలింలు, వెబ్ సిరీస్‌లు మా వినోద్ ఫిలిం అకాడమీ తరుపున చాలా చేశాం. త్వరలో ఒక సినిమా కూడా మొదలుపెట్టబోతున్నాం.
 
- ప్రస్తుతం ప్రేక్షకులు చిన్న సినిమా పెద్ద సినిమా అనేది తేడా లేకుండా ఏ సినిమా నచ్చితే ఆ సినిమా చూస్తున్నారు కాబట్టి చిన్న సినిమాలు కూడా పెద్ద హిట్ అవుతున్నాయి మా ల్యాంప్ సినిమా కూడా అదే రకంగా హిట్ అవుతుందని మేము ఆశిస్తున్నాం. మంచి కంటెంట్‌తో వస్తున్న సినిమా. నా అభిమాన నటులు బాలకృష్ణ చిరంజీవి ఎన్టీఆర్.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

''బాహుబలి-2'' రికార్డు గల్లంతు.. ఎలా?