Webdunia - Bharat's app for daily news and videos

Install App

బిగ్ బాస్ హౌస్‌లో సినీ తారలు.. అమీర్ ఖాన్ కూడా వస్తున్నారట! (video)

Webdunia
గురువారం, 23 సెప్టెంబరు 2021 (13:18 IST)
బిగ్ బాస్ హౌస్‌లో జోష్‌ను నింపడానికి సర్‌ప్రైజ్‌గా నాగ్‌తో పాటు రామ్ చరణ్‌, నితిన్‌, తమన్నా, నభా నటేష్‌లను స్టేజ్‌పై రప్పించారు. అటు కంటెస్టెంట్లలోనూ, ప్రేక్షకుల్లో ఆనందాన్ని డబుల్‌ చేశారు బిగ్ బాస్‌. మరోసారి కంటెస్టెంట్లకు సర్‌ప్రైజ్ ఇవ్వడానికి బిగ్ బాస్‌ రంగం సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇందుకోసం ఏకంగా బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ ని స్టేజ్‌పైకి పిలువనున్నారని తెలిసింది. 
 
నెక్స్‌ వీకెండ్ ఎపిసోడ్‌లో కింగ్ నాగ్‌తో పాటు అమీర్ ఖాన్ కూడా స్టేజ్‌ని షేర్ చేసుకోనున్నట్లు సమాచారం. అంతేకాకుండా వీరితో పాటు అక్కినేని హీరో నాగ చైతన్య కూడా స్టేజ్‌పై అలరించనున్నారని తెలుస్తుంది. ఇటీవల.. చైతూ నటించిన లవ్ స్టోరీ మూవీ ప్రీ రిలీజ్ వేడుకకు అతిథిగా అమీర్ ఖాన్ వచ్చిన విషయం తెలిసిందే. ఆ ఈవెంట్ కోసం హైదరాబాద్ వచ్చిన అమీర్ ఖాన్‌ను బిగ్ బాస్ షోకి గెస్ట్‌గా పిలిచారట నిర్వహకులు. 
 
దానికి అమీర్ ఖాన్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో .. ఎపిసోడ్ షూటింగ్ కూడా పూర్తయినట్టు తెలుస్తుంది. కానీ, దీనిపై అధికారిక ప్రకటన రావాల్సింది. మరో విశేషమేమంటే.. అమీర్ లేటెస్ట్ మూవీ లాల్ సింగ్ చద్దా చిత్రంలో నాగ చైతన్య కీలక పాత్రలో నటించనున్నారు. బిగ్ బాస్ స్టేజ్ మీద ఈ సినిమా ప్రమోషన్ చేసి ఉంటారని ఊహగానాలు వ్యక్తమవుతున్నాయి. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నా భార్యతో విడాకులు ఇప్పించండి.. ఒమర్ : కూర్చొని మాట్లాడుకోండి.. సుప్రీం

3 నుంచి 5వేల సంవత్సరం మధ్యలో చంద్రుడు బూడిదవుతాడట, భయపెడుతున్న భవిష్యవాణి

మామిడి చెట్లకు వైభవంగా వివాహం.. జీలకర్ర, బెల్లం, మంగళసూత్రంతో.. ఎక్కడ?

సుప్రీంకోర్టు తదుపరి చీఫ్ జస్టిస్‌‌గా బీఆర్ గవాయ్

75వ పుట్టినరోజు.. ఫ్యామిలీతో విదేశాలకు ఏపీ సీఎం చంద్రబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

తర్వాతి కథనం
Show comments