వరల్డ్స్ బిగ్గెస్ట్ రియాలిటీ షో 'బిగ్ బాస్' తెలుగు సీజన్ 5 రసవత్తరంగా సాగుతోంది. ఫస్ట్ వీక్ సెవన్ ఆర్ట్స్ సరయు, రెండో వారం క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఉమా దేవి ఎలిమినేట్ అయ్యారు. ఇక నామినేషన్స్ స్టార్ట్ అయ్యే సోమవారం ఎపిసోడ్‌లో కంటెస్టంట్స్ రచ్చ రచ్చ చేశారు.
నటి ప్రియ.. లహరి, యాంకర్ రవిలపై సంచలన ఆరోపణలు చేసింది. మిడ్ నైడ్ వాష్ రూంలో రవి, లహరి హగ్ చేసుకున్నారని చెప్పి అందరికీ షాక్ ఇచ్చింది. తామిద్దరి మధ్య ఉన్నది బ్రదర్ అండ్ సిస్టర్ రిలేషన్ మాత్రమే.. మాకూ ఫ్యామిలీస్ ఉన్నాయి.. ఇలాంటి కామెంట్స్ చేస్తే చూసేవాళ్లు ఏమనుకుంటారు అంటూ రవి, లహరి సీరియస్ అవడంతో ప్రియ మోకాళ్లపై కూర్చుని సారీ చెప్పింది.
ఇక నామినేషన్స్ విషయానికి వచ్చే సరికి ఒకరంటే ఒకరు పోటీ పడ్డారు. ఇక ఈవారం ఎవరు ఎవరిని నామినేట్ చేశారో చూద్దాం.. నటరాజ్ మాస్టర్ : సిరి – కాజల్.. వీజే సన్నీ : ప్రియ, కాజల్.. సిరి : శ్వేత వర్మ- లహరి.. అనీ మాస్టర్ : శ్రీరామ చంద్ర – మానస్.. యాంకర్ రవి : శ్రీరామ చంద్ర – జెస్సీ.. లహరి : ప్రియ – శ్రీరామ చంద్ర.. లోబో : ప్రియాంక సింగ్ – శ్రీరామ చంద్ర.. శ్రీరామ చంద్ర : మానస్ – యాంకర్ రవి.