Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మ‌క్కికి మ‌క్కీ రీమేక్ చేసిన సినిమా మాస్ట్రో రివ్యూ, నితిన్ పియానో ఫార్ములా...

మ‌క్కికి మ‌క్కీ రీమేక్ చేసిన సినిమా మాస్ట్రో రివ్యూ, నితిన్ పియానో ఫార్ములా...
, శుక్రవారం, 17 సెప్టెంబరు 2021 (20:58 IST)
Mastro still
నటీనటులు: నితిన్, నభానటేష్, తమన్నా, సీనియ‌ర్ నరేష్, మంగ్లీ, హ‌ర్ష‌వ‌ర్ధ‌న్‌, ర‌చ్చ‌ర‌వి త‌దిత‌రులు
సాంకేతిక‌తః  సినిమాటోగ్రఫీ: జె యువరాజ్‌, సంగీత దర్శకుడు: మహతి స్వరసాగర్‌, ఎడిటర్: ఎస్‌ఆర్‌ శేఖర్‌, నిర్మాతలు: ఎన్‌. సుధాకర్‌రెడ్డి, నిఖితా రెడ్డి, దర్శకుడు: మేర్లపాక గాంధీ

 
అంధధూన్ అని వచ్చిన హిందీ సినిమాని తెలుగులో మాస్ట్రో గా రీమేక్  చేశారు.హిందీ లో ఆకాష్ ఖురాన. నటించిన పాత్ర‌లో నితిన్ నడిచిన ఈ మాస్ట్రో మర్డర్ మిస్టరీతో రూపొందింది. నితిన్ స్వంత నిర్మాణ సంస్థ‌లో రూపొందిన ఈ సినిమా ఈరోజే ఓటీటీలో విడుద‌లైంది. అదెలా వుందో చూద్దాం.

 
కథః
పియానో ప్లే చేస్తూ జీవితాన్ని వెళ్ల‌దీసే కళ్ళు లేని అరుణ్‌ (నితిన్) ఓ కాల‌నీలో వుంటాడు. ఇళయరాజాను అమితంగా ఇష్టపడే అతనికి పియానో అంటే ప్రాణం. తన పియానో పాడైపోవడంతో ఓ నైట్ క్లబ్ లో చేరి, పియానో ప్రాక్టీస్ చేస్తూ, కొంత డబ్బుల్ని వెనకేసుకుంటాడు. ఆ క్లబ్ ఓనర్ కుమార్తె సోషియా (నభా నటేశ్‌) అరుణ్ పట్ల ఇష్టాన్ని పెంచుకుంటుంది.

అదే సిటీలో ఉండే ఒకప్పటి హీరో మోహన్ (నరేశ్‌) అరుణ్ సంగీతాన్ని ముగ్థుడ‌వుతాడు. త‌న పుట్టిన‌రోజున ఇంటికి ర‌మ్మ‌ని ఆహ్వానిస్తాడు. కానీ అదేరోజు మోహ‌న్ వేరే ఊరు వెళ్ళిపోతాడు. అత‌ని రెండో భార్య సిమ్రాన్ (తమన్నా) ఇంటిలో వుంటుంది. మోహ‌న్ ఈరోజు పియానో వాయించ‌మ‌న్నార‌ని వాయించి వెళ్ళిపోతాన‌ని అక్క‌డే వాయిస్తాడు. ఆ క్ర‌మంలో ఆయ‌న‌కు ఇంటిలో షాకింగ్ దృశ్యం క‌నిపిస్తుంది. అస‌లు క‌ల్ళు క‌నిపించ‌ని అరుణ్ ఆ దృశ్యాన్ని ఎలాచూశాడు? అస‌లు అరుణ్ ఇలా మార‌డానికి కార‌ణం ఏమిటి? అనేది మిగిలిన సినిమా.

 
విశ్లేష‌ణః
ఈ యేడాది ఇప్పటికే నితిన్ నటించిన ‘చెక్‌’, ‘రంగ్ దే’ చిత్రాలు విడుదలయ్యాయి. కథాపరంగా ‘చెక్‌’ భిన్నమైనదే అయినా విజయం విషయంలో నిరుత్సాహపర్చింది. ఇక లవ్ అండ్‌ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ‘రంగ్ దే’ కు మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. కానీ ఆశించిన స్థాయి సక్సెస్ ను అందుకోలేక పోయింది. ఈ నేపథ్యంలో వచ్చిన సినిమా ‘మాస్ట్రో’. ఈ చిత్రం థియేటర్లలో కాకుండా డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్ లో శుక్రవారం నుండి స్ట్రీమింగ్ అవుతోంది 

 
మిస్ట‌రీ క‌థ క‌నుక ఆస‌క్తిగా అనిపించాలి. ఇందులో ప్ర‌ధాన లోపం ఏమంటే అస‌లు గుడ్డివాడు కాక‌పోయినా ఎందుకు గుడ్డివాడుగా న‌టిస్తున్నాడ‌నేదానికి క్లారిటీ లేదు. కేవ‌లం హిందీ సినిమాను రీమేక్ యాజ్‌టీజ్‌గా చేశామా? అనేది మాత్ర‌మే చూపిన‌ట్లుంది. ఇందులో త‌మ‌న్నా పాత్ర కీల‌కం. ఆమె చేసిన న‌ట‌న క‌థ‌ను న‌డిపించింది. హీరోయిన్ గా  పాత్రలు తగ్గడం తో  విలన్ షెడ్స్ ఉన్న పాత్రలో తమన్నా కనిపించింది. ఉన్నది ఉన్నట్టుగా తెలుగులో తీసిన ఈ సినిమాని హిందీ లొనే ప‌ర్లేదు అనిపించేలా ఆడింది.

 
మూడేళ్ళ క్రితం సినిమాను తెలుగులో రీమేక్ చేస్తే ఇక్కడి వాళ్ళు ఆదరిస్తారా? అనే సందేహం కొందరికి రాకపోలేదు. పైగా నితిన్ లాంటి సాఫ్ట్ ఇమేజ్ ఉన్న హీరో ఈ థ్రిలర్ మూవీలో నటించి, మెప్పించగలడా? అనీ అనుకున్నారు. కానీ వారి అంచనాలు తప్పు అని నితిన్ తన నటనతో నిరూపించాడు. గత వారం వచ్చిన ‘సీటీమార్’లో కబడ్డీ కోచ్ జ్వాలారెడ్డిగా నటించిన తమన్నా అందుకు పూర్తి భిన్నమైన పాత్రను ఇందులో చేసింది. త‌న డ‌బ్బింగ్ త‌నే చెప్పుకుంది. 

 
అంధుడి పియానో క‌థ‌. అందులో కిడ్నీ రాకెట్ అంశాన్ని జోడించారు. ఇందులో న‌టీన‌టులు అంద‌రూ బాగానే న‌టించారు. మొద‌టి షాట్ కుందేలును చంప‌డానికి తుపాకితో ఓ రైతు కాల్చ‌డం ముగింపు అక్క‌డే చేయ‌డం బాగుంది. ఎదుటివారిని కాపాడాలనే చూసే హీరోకు ఆ వ్య‌క్తి హీరోనే చంపాల‌నుకోవ‌డం అనే పాయింట్ ఇందులో ఆస‌క్తిక‌రం. మంచి చేస్తే మంచే జ‌రుగుతుంద‌నే కాన్సెప్ట్‌తో ఈ చిత్ర ముగింపు వుంటుంది.

 
మహతి స్వర సాగర్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఎండ్ టైటిల్స్ లో వచ్చే ‘మాస్ట్రో’ టైటిల్ సాంగ్ బాగుంది. నేపథ్య గీతాలుగా వచ్చే ‘ఓ బేబీ… ఓ బేబీ… చిన్ననవ్వే చాలే’, ‘అనగనగా అందమైన కథగా…’ కూడా ఫర్వాలేదు. జె. యువరాజ్ సినిమాటోగ్రఫీ చాలా వరకూ మాతృక లోని ఫ్రేమ్స్ తోనే సాగింది. అయితే తెలుగు సినిమా అయినా ఎక్క‌డా బాక్‌డ్రాప్ అలా క‌నిపించ‌క‌పోవ‌డం విశేషం. తెలుగు నేటివిటీ లేకపోవడం కాస్తంత బోర్ కొట్టే ప్రీ క్లయిమాక్స్ వున్నాయి. ఇలాంటి బ్లాక్ కామెడీ థ్రిల్లర్ మూవీస్ తెలుగులో రేర్ గా వస్తుంటాయి. ఒకవేళ అడపాదడపా వచ్చినా, పేరున్న హీరోలు చేయడం తక్కువ. కానీ నితిన్ నటుడిగా, నిర్మాతగా ఓ ధైర్యం చేశాడు. అందుకు అభినందించాలి. 
రేటింగ్: 2.75 / 5

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఇప్ప‌టి త‌రం చూడ‌త‌గ్గ చిత్రంగా విజ‌య రాఘ‌వ‌న్ (రివ్యూ రిపోర్ట్‌)