బుల్లితెర ప్రేక్షకులకు బిగ్‌బాస్ ఫుల్ మజా అందిస్తుంది. కొట్లాటలకు కొదువేలేదు. అన్ లిమిటెడ్ ఫన్‌తో టన్నుల కొద్దీ ఎంటర్‌టైన్‌మెంట్‌ని అందిస్తుంది. కెప్టెన్సీ పోటీదారుల కోసం 'పంథం నీదా నాదా'అనే టాస్క్ పెట్టి.. కంటెస్టెంట్ల మధ్య నిప్పురజేశారు. మంగళవారం నాడు ఆ హీటును తగ్గించడానికి కాస్త ఫన్‌ని జోడించాడు బిగ్ బాస్. కడుపుబ్బ నవ్వించేలా.. ఓ కామెడీ టాస్క్‌ను క్రియేట్ చేశాడు బిగ్ బాస్.
కెప్టెన్సి కంటెండర్ టాస్క్‌గా 'అమెరికా అబ్బాయి, హైదరాబాద్ అమ్మాయి' అనే పేరుతో బిగ్ బాస్ ఓ పెళ్ళి చూపుల తతంగాన్ని కంటెస్టెంట్స్ అందరితో చేయించాడు. ఇందులో లహరి హైదరాబాద్ కు చెందిన అమ్మాయి కాగా ఆమె తల్లిదండ్రులుగా యానీ, నటరాజ్ నటించారు.
లహరి మతిమరుపు మామ పాత్రను రవి పోషించగా, పక్కింటి అబ్బాయిగా మానస్ చేశాడు. ఇక అమెరికా అబ్బాయిగా శ్రీరామ్, అతని తల్లిగా ప్రియా నటించగా, శ్రీరామ్ పీఏగా విశ్వ, స్నేహితుడిగా సన్ని నటించారు. కాజల్ అతని లవర్ గా నటించింది. సెలైంట్‌గా ఉన్న షణ్ముఖ్‌కు మ్యారేజ్ బ్రోకర్ గానూ, ఈవెంట్ మేనేజర్ గా లోబో, అతని అసిస్టెంట్ గా శ్వేత వర్మ నటించారు.
అయితే.. శ్రీరామ్ లహరిని పెళ్లి చేసుకోవడానికి అమెరికా నుంచి వస్తాడు. వీరిద్దరి పెళ్లి కుదిర్చేందుకు షణ్ముఖ్ బాగా ట్రై చేస్తుంటాడు. కానీ మానస్ మాత్రం లహరిని చాలా ఇష్టపడుతున్నాడు. ఎమైనా చేసి పెళ్లి క్యాన్సిల్ చేయాలని ప్లాన్ చేస్తుంటాడు. మరోవైపు.. ప్రియుడు శ్రీరామ్ పెళ్లి అని అతని మాజీ ప్రియురాలు హమీద సైతం హైదరాబాద్ వచ్చింది.
హమీద కూడా ఈ పెళ్లిని క్యాన్సిల్ చేసి.. తానుశ్రీరామ్‌ను పెళ్లి చేసుకోవాలని ప్రయత్నిస్తుంది. ఈ క్రమంలో సంభాషణలు.. కడుపుబ్బ నవ్విస్తున్నాయి. ఈ టాస్క్‌తో హౌస్‌లో ఫన్ క్రియేటయ్యింది. మరోవైపు.. యాంకర్ రవికి సీక్రెట్ టాస్క్ ఇస్తాడు బిగ్ బాస్. ఈ టాస్క్ లో యాంకర్ రవి ఏం చేయబోతున్నాడనేది ఆసక్తికరంగా మారింది.
మరోవైపు .. సోమవారం 'వాల్ ఆఫ్ షేమ్'లో లహరి, రవిపై ఆరోపణలు చేసిన ప్రియా.. కెమెరా ముందుకొచ్చి, తన ఆరోపణల కారణంగా లహరి, రవి మనసు గాయపర్చినందుకు సారీ చెప్పింది. దీంతో ఆ గొడవ అక్కడితో ముసిగినట్టు అనిపించింది.