Webdunia - Bharat's app for daily news and videos

Install App

పూరి ఫైటర్ మూవీకి నో చెప్పిన స్టార్ హీరో, ఇంతకీ ఎవరా హీరో..?

Webdunia
మంగళవారం, 21 ఏప్రియల్ 2020 (20:29 IST)
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కిస్తోన్న తాజా చిత్రం ఫైటర్. ఈ చిత్రంలో సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ - బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే జంటగా నటిస్తున్నారు. పూరి - ఛార్మి - కరణ్ జోహర్ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా మూవీగా రూపొందుతోన్న ఈ సినిమా ఇప్పటి వరకు దాదాపు 40 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది. ముంబాయిలో విజయ్ దేవరకొండ, అనన్య పాండే, రమ్యకృష్ణ లపై కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. 
 
ప్రస్తుతం షూటింగ్స్ ఆగిపోయాయి. అంతా సెట్ అయిన తర్వాత ముంబయిలో మరో భారీ షెడ్యూల్ ప్లాన్ చేయనున్నారు. ఇదిలా ఉంటే.. ఈ సినిమా గురించి ఓ కొత్త వార్త ప్రచారంలోకి వచ్చింది. అది ఏంటంటే... బన్నీ, పూరి కలిసి దేశముదురు సినిమా చేసారు. ఆ సినిమా బ్లాక్ బస్టర్ అయ్యింది. ఆ తర్వాత మరో సినిమా చేయాలనుకున్నారు. వాళ్ల‌ద్ద‌రి మధ్య కొన్ని డిష్కసన్స్ నడిచాయి. వాటిలో ఫైట‌ర్‌ మూవీ కూడా ఒక‌టి. కానీ.. బ‌న్నీ ఈ క‌థ‌కు నో చెప్పాడు. 
 
ఆ త‌ర‌వాత పూరి బన్నీకి ఇద్ద‌ర‌మ్మాయిల‌తో కథ చెప్పాడు. ఈ కథ బన్నీకి బాగా నచ్చింది. ఈ కథతో సినిమా చేయడం.. ఇద్దరమ్మాయిలతో.. ఆశించిన స్థాయిలో ఆకట్టుకోకపోయినా.. యావరేజ్‌గా నిలిచింది. అయితే.. బ‌న్నీ నో చెప్పాక ఫైటర్ స్టోరీని ప‌క్క‌న పెట్టేశాడు పూరి.
 
 ఆ తర్వాత కొడుకు ఆకాష్‌తో ఫైటర్ మూవీ చేయాలనుకున్నారు కానీ.. ఎందుకనో ఆకాష్‌తో సినిమా చేసే అవకాశం తన శిష్యుడు అనిల్ పాడూరికి ఇచ్చారు. ఇప్పుడు బన్నీ నో చెప్పగా, ఆకాష్‌తో చేయాలనుకున్న సినిమాని ఇప్పుడు విజయ్ దేవరకొండతో చేస్తున్నారు. అదే ఫైటర్. మరి.. బన్నీ నిర్ణయం రైటో రాంగో తెలియాలంటే ఫైటర్ రిలీజ్ వరకు ఆగాల్సిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పోసాని కృష్ణ మురళికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఊరట.. ఈ నెల 24కి విచారణ వాయిదా

రీల్స్ కోసం రైలు పట్టాలపై పడుకున్నాడు.. కదిలే రైలు అతనిపై నుంచి పోయింది.. (వీడియో)

విద్యుత్ తీగలపై నిల్చుని ఆకులు తింటున్న మేక- వీడియో వైరల్

మందేశాడు.. గూగుల్ మ్యాప్‌ను నమ్మి రైల్వే ట్రాక్‌పై కారును నడిపాడు.. చివరికి ఏమైందంటే?

పవన్ కళ్యాణ్ ఏపీ ఉప ముఖ్యమంత్రి కావడం దురదృష్టకరం: కల్వకుంట్ల కవిత (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

తర్వాతి కథనం
Show comments