మహేష్‌ బాబుతో రాజమౌళి ఎలాంటి సినిమా తీయనున్నాడు?

Webdunia
మంగళవారం, 21 ఏప్రియల్ 2020 (19:36 IST)
రాజమౌళి-మహేష్ బాబు
సూపర్ స్టార్ మహేష్‌ బాబు - దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్లో సినిమా అని గత కొన్ని సంవత్సరాలుగా వార్తలు వస్తూనే ఉన్నాయి కానీ.. ఇన్నాళ్లు అఫిషియల్‌గా ఎనౌన్స్ చేయలేదు. అయితే.. రీసెంట్‌గా ఓ న్యూస్ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజమౌళి మాట్లాడుతూ.. ఆర్ఆర్ఆర్ తర్వాత తను చేసే సినిమా మహేష్ బాబుతోనే అని ఎనౌన్స్ చేసారు. దీంతో మహేష్ ఫ్యాన్స్ ఉత్సాహం అంతాఇంతా కాదు. 
 
అయితే.. మహేష్ బాబుని ఎలా చూపించనున్నాడు? ఏ తరహా సినిమా చేయనున్నాడు అని అభిమానులు ఇప్పటి నుంచే ఆలోచించడం మొదలెట్టేసారు.
 
అల్లూరి సీతారామరాజు సినిమాని తీయమని చెప్పినప్పటికీ.. రాజమౌళి, మహేష్‌ అది క్లాసిక్. ఆ క్లాసిక్‌ని ముట్టుకోకూడదు అనే నిర్ణయం తీసుకున్నారు. అందుచేత మహేష్‌ బాబుతో హాలీవుడ్ రేంజ్‌లో యాక్షన్ మూవీ చేయాలని ఫిక్స్ అయ్యారు. దీనికి ఆల్రెడీ విజయేంద్రప్రసాద్ స్టోరీ రాయడం స్టార్ట్ చేసారు. 
 
ఇక ఎప్పుడు సెట్స్ మీదకి వెళుతుంది అంటే.. 2021లో ఆర్ఆర్ఆర్ రిలీజ్ కానుంది. ఆ తర్వాత 2022లో మహేష్ బాబుతో మూవీని సెట్స్ పైకి తీసుకెళ్లాలి అనేది జక్కన్న ప్లాన్. ఈలోపు మహేష్ పరశురామ్‌తో సినిమాని చేస్తాడు.
 
 మహేష్ - రాజమౌళి కాంబినేషన్లో రూపొందే సినిమాని దుర్గా ఆర్ట్స్ బ్యానర్లో డా.కె.ఎల్.నారాయణ నిర్మించనున్నారు. ఈ విషయాన్ని స్వయంగా రాజమౌళి ప్రకటించారు. మరి.. ఈ సినిమాతో ఎలాంటి సంచలనం సృష్టిస్తారో చూడాలి.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

స్కూటీ మీద స్కూలు పిల్లలు, గుద్దేశారు, వీళ్లకి డ్రైవింగ్ లైసెన్స్ వుందా? (video)

కవితతో మంచి సంబంధాలున్నాయ్.. కేటీఆర్ మారిపోయాడు.. నవీన్ కుమార్ యాదవ్

జాగ్రత్తగా ఉండండి: సురక్షిత డిజిటల్ లావాదేవీల కోసం తెలివైన పద్ధతులు

Pawan Kalyan just asking, అడవి మధ్యలోకి వారసత్వ భూమి ఎలా వచ్చింది? (video)

అసూయపడే, అహంకారపూరిత నాయకులకు ప్రజలు అధికారం ఇవ్వరు: రేవంత్ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

తర్వాతి కథనం
Show comments