Webdunia - Bharat's app for daily news and videos

Install App

సెప్టెంబర్ నుంచి షూటింగ్ సందడి

Webdunia
సోమవారం, 31 ఆగస్టు 2020 (21:22 IST)
కరోనా కారణంగా సినిమా షూటింగ్స్ ఆగిపోయిన విషయం తెలిసిందే. ప్రభుత్వం అనుమతి ఇచ్చినా.. షూటింగ్స్ స్టార్ట్ చేసే పరిస్థితి లేకపోవడంతో ఇన్నాళ్లు షూటింగ్స్‌కి బ్రేక్ పడింది. అయితే.. సెప్టెంబర్ నుంచి షూటింగ్స్ స్టార్ట్ చేయడానికి ముందుకు వస్తున్నారు మన హీరోలు. ముందుగా టాలీవుడ్ కింగ్ నాగార్జున ఈరోజు నుంచి వైల్డ్ డాగ్ మూవీ షూటింగ్ స్టార్ట్ చేస్తున్నారు. అలాగే బిగ్ బాస్ 4 షూటింగ్ కూడా స్టార్ట్ చేస్తున్నారు.
 
అలాగే నాగచైతన్య కూడా షూటింగ్ స్టార్ట్ చేస్తున్నారు. నాగచైతన్య లేటెస్ట్ మూవీ లవ్ స్టోరీ. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతోన్నలవ్ స్టోరీ మూవీని సెప్టెంబర్ 7 నుంచి స్టార్ట్ చేయనున్నారు. సాధ్యమైనంత త్వరగా లవ్ స్టోరీ మూవీని కంప్లీట్ చేసి విక్రమ్ కుమార్‌తో సినిమా స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు. చైతన్య - విక్రమ్ కుమార్ కాంబినేషన్లో రూపొందుతోన్న థ్యాంక్యూ మూవీని దిల్ రాజు నిర్మిస్తున్నారు.
 
ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ మూవీ అక్టోబర్‌లో సెట్స్ పైకి వెళ్లనున్నట్టు సమాచారం. నాగార్జున, నాగచైతన్యలతో పాటు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కూడా రాథేశ్యామ్ షూటింగ్ సెప్టెంబర్ నుంచి స్టార్ట్ చేయనున్నారు. సెప్టెంబర్ 20 నుంచి ఈ మూవీ షూటింగ్ ప్రారంభించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. సత్యదేవ్-తమన్న హీరోహీరోయిన్లుగా రీసెంట్‌గా మొదలైన గుర్తుందా శీతాకాలం సినిమా కూడా సెప్టెంబర్ లోనే సెట్స్ పైకి వెళ్లనుంది.
 
అలాగే దర్శకుడు సతీష్ వేగేశ్న తాజాగా కోతికొమ్మచ్చి అనే సినిమాను ఎనౌన్స్ చేశాడు. తన కొడుకు సమీర్, దివంగత నటుడు శ్రీహరి కొడుకు మేఘాంష్ హీరోలుగా ఈ సినిమాను సెప్టెంబర్ చివరి వారం నుంచి సెట్స్ పైకి తీసుకువెళ్లనున్నారు. వీళ్లతో పాటు సంపత్ నంది కథ అందించిన సినిమాలు కూడా ప్రారంభించనున్నారు. మొత్తానికి కరోనా కారణంగా ఆగిన సినిమా షూటింగ్‌లు సెప్టెంబర్ నుంచి సందడి చేస్తే.. టాలీవుడ్‌కి కళ రావడం ఖాయం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అణు ఒప్పందంపై సంతకం చేయకుంటే టెహ్రాన్‌ను పేల్చేస్తాం - ట్రంప్ : కుదరదంటున్న ఇరాన్

సజీవ సమాధికి వ్యక్తి యత్నం : అడ్డుకున్న పోలీసులు

అలహాబాద్ ట్రిపుల్ ఐటీలో నిజామాబాద్ విద్యార్థి ఆత్మహత్య!

ఎస్వీఎస్ఎన్ వర్మ వైకాపాలో చేరుతారా? క్రాంతి ఈ కామెంట్లు ఏంటి? పవన్ సైలెంట్?

రణరంగంగామారిన సెంట్రల్ యూనివర్శిటీ - విద్యార్థుల ఆందోళనలు... అరెస్టులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments