Webdunia - Bharat's app for daily news and videos

Install App

తింటున్నంతసేపు ఇస్తరాకు.. తిన్నాక ఎంగిలి ఆకు...

Webdunia
శుక్రవారం, 15 మే 2020 (16:15 IST)
టాలీవుడ్ నిర్మాత బండ్ల గణేష్ చేసే ట్వీట్ వెనుక నిగూఢార్థం దాగివుంటుంది. అందుకే ఆయన చేసే ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తాజాగా ఆయన చేసిన ఓ ట్వీట్ ఇపుడు సోషల్ మీడియానే కాదు... టాలీవుడ్‌లో కూడా చర్చనీయాంశంగా మారింది. తింటున్నంత సేవు ఇస్తరాకు.. తిన్న తర్వాత ఎంగిలి ఆకు అంటారంటూ ఓ ట్వీట్ చేశారు. ఇలా ట్వీట్ చేయడానికి అసలు కారణ లేకపోలేదు. 
 
బండ్ల గణేష్ నిర్మాతగా, హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం గబ్బర్ సింగ్. ఈ చిత్రం విడుదలై ఇటీవల ఎనిమిదేళ్లు పూర్తిచేసుకుంది. ఈ క్రమంలో చిత్ర దర్శకుడు హరీష్ శంకర్ ఓ ట్వీట్ చేశారు. అందులో నిర్మాత బండ్ల గణేష్ పేరును మరచిపోయారు. ఆ తర్వాత చేసిన తప్పును తెలుసుకుని మరో ట్వీట్ చేశారు. అందులో నిర్మాత బండ్ల గణేష్‌ను ఆకాశానికెత్తేశారు. దీంతో ఈ వివాదం ముగిసిపోయిందని ప్రతిఒక్కరూ భావించారు. 
 
కానీ, బండ్ల గణేష్ బాగా హర్ట్ అయినట్టున్నారు. అందుకే ఈ అంశాన్ని మనసులో పెట్టుకునే ఆయన తాజా ట్వీట్ చేశారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. కాకరేపుతున్న బండ్ల గణేష్ ట్వీట్‌ను పరిశీలిస్తే, 'తింటున్నంత సేపు ఇస్తరాకు అంటారు. తిన్నాక ఎంగిలి ఆకు అంటారు. నీతో అవసరం ఉన్నంత వరకు వరసలు కలిపి మాట్లాడతారు. అవసరం తీరాక... లేని మాటలు అంటకడతారు' అని బండ్ల గణేశ్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ డైరెక్టర్ హరీష్ శంకర్‌ను ఉద్దేశించే చేశారని చెప్పుకుంటున్నారు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Amaravati: అమరావతిలో ఎకరం రూ.20కోట్లు...

Indian Student: అమెరికాలో కూడా ఇలాంటి ఆటలా? భారతీయ విద్యార్థి అరెస్ట్

రాత్రి బోయ్ ఫ్రెండ్ ఇంటికి వెళ్లింది, తెల్లారేసరికి శవమై కనబడింది, ఏమైంది?

Madhya Pradesh: ఏకలవ్య స్కూల్ ప్రిన్సిపాల్, లైబ్రేరియన్‌.. ఇద్దరూ జుట్టు పట్టుకుని కొట్టుకున్నారు..(video)

వీడి దుంపతెగ... లైవ్ కాన్సెర్ట్‌లోనే కానిచ్చేశాడు.. (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments