Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రియుడుని పరిచయం చేసిన 'చిన్నారి పెళ్లికూతురు'

Webdunia
గురువారం, 12 నవంబరు 2020 (13:35 IST)
టాలీవుడ్ హీరోయిన్లలో అవికా గోర్ ఒకరు. "చిన్నారి పెళ్లి కూతురు" అనే టీవీ సీరియల్ ద్వారా దేశ వ్యాప్తంగా పాపులర్ అయింది. ఆ తర్వాత వెండితెరపై అరంగేట్రం చేసింది. తెలుగులో ఆమె తొలి చిత్రం 'ఉయ్యాలా జంపాల'. ఈ చిత్రం మంచి విజయం సాధించింది.
 
ఆ తర్వాత ఆమె పలు చిత్రాల్లో నటించింది. అలాంటి వాటిల్లో 'ల‌క్ష్మీ రావే మా ఇంటికి', 'సినిమా చూపిస్తా మావ'‌, 'త‌ను నేను', 'ఎక్క‌డికి పోతావు చిన్నవాడా' వంటి చిత్రాల‌లో న‌టించింది. చివ‌రిగా 2019లో "రాజు గారి గ‌ది 3" చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఈ సినిమా త‌ర్వాత అవికా కొంత గ్యాప్ తీసుకున్న అవికా అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచేలా స‌రికొత్త లుక్‌లోకి మారింది.
 
తాజాగా త‌న ప్రియుడిని ప‌రిచ‌యం చేసింది ఈ ముద్దుగుమ్మ‌. అయితే పెళ్లి ఇప్ప‌ట్లో చేసుకోమ‌ని అంటున్న అవికా.. ప్రేమ‌, జీవితం అంద‌మైన అనుభవంలా ఉందంటూ కాబోయే భ‌ర్త‌తో క‌లిసి దిగిన ఫొటోలు షేర్ చేసింది. ఇవి అభిమానుల‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంటున్నాయి.
 
ఇక అవికా ప్రియుడు పేరు మిలింద్ చ‌ద్వానీ కాగా, త‌న‌పై ఉన్న ప్రేమ‌ని ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వ్య‌క్తం చేసింది. నా ప్రార్థన‌ల‌కు ఫ‌లితం దొరికింది. మ‌నకు న‌చ్చిన వ్య‌క్తి దొర‌క‌డం క‌ష్టం అనుకున్నా కాని, అలాంటి వ్య‌క్తి దొరికేశాడు. ఇది క‌ల‌లా ఉంది. ఈ బంధం నా జీవితంలో కీల‌క పాత్ర కానుంద‌ని అవికా గోర్ చెప్పుకొచ్చింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

KTR: కేటీఆర్‌‌కు ఓ స్వీట్ న్యూస్ ఓ హాట్ న్యూస్.. ఏంటది?

గంటలో శ్రీవారి దర్శనం.. ఎలా? వారం రోజుల పాటు పైలెట్ ప్రాజెక్టు!

బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం... ఉత్తారంధ్రకు భారీ వర్ష సూచన!

మీసాలు తిప్పితే రోడ్లు పడవు : మీ కోసం పని చేయనివ్వండి .. పవన్ కళ్యాణ్

హనీమూన్‌కు ఎక్కడికి వెళ్లాలి.. అల్లుడుతో గొడవు.. మామ యాసిడ్ దాడి!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

పొడియాట్రిక్ పాదాలు-చీలమండ చికిత్సను మెరుగుపరచడానికి ఇసావోట్ అత్యాధునిక ఓ-స్కాన్ ఎంఆర్ఐ మెషీన్‌

చేదుగా వుండే కాకరకాయ ఆరోగ్యానికి అద్భుతమైన మేలు

ఉదయం పూట ఖాళీ కడుపుతో తీసుకోదగిన ఆహారం, ఏంటి?

భారతదేశంలో పెరుగుతున్న ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కేసులు: ముందస్తుగా గుర్తించడం ఎందుకు కీలకం

తర్వాతి కథనం
Show comments