Webdunia - Bharat's app for daily news and videos

Install App

#నటి అర్చన పెళ్లి- అట్టహాసంగా రిసెప్షన్.. హాజరైన సెలెబ్రిటీలు

Webdunia
గురువారం, 14 నవంబరు 2019 (12:34 IST)
బిగ్ బాస్ ఫేమ్ అర్చ‌న వివాహం హెల్త్‌కేర్‌ సంస్థ వైస్‌ ప్రెసిడెంట్‌ జగదీశ్‌తో అట్టహాసంగా జ‌రిగింది. వీరి పెళ్ళి వేడుక‌లో ప‌లువురు సినీ సెల‌బ్రిటీలు సంద‌డి చేశారు. పెళ్ళికి కొద్ది గంటల ముందు రిసెప్షన్ వేడుక నిర్వ‌హించారు. గచ్చిబౌలిలోని కొల్లమాధవరెడ్డి గార్డెన్‌లో అర్చ‌న వివాహం జ‌రిగింది. 
 
అక్టోబ‌ర్ 3న హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని రాడిసన్ బ్లూ హోటల్‌లో అర్చ‌న జగదీశ్‌తో నిశ్చితార్ధం జ‌రుపుకున్న సంగ‌తి తెలిసిందే. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో కలిపి సుమారుగా 40 సినిమాల్లో న‌టించిన అర్చ‌న చివ‌రిగా ‘వజ్ర కవచధర గోవింద’ చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది.
 
అంతకుముందు జరిగిన సంగీత్ కార్యక్రమాన్ని ఆటపాటల నడుమ సందడిగా నిర్వహించారు. వధూవరులు అర్చన, జగదీష్ సినిమా పాటలకు స్టెప్పులేస్తూ కార్యక్రమాన్ని హుషారెత్తించారు. అర్చన స్నేహితులైన శివబాలాజీ-మధుమిత దంపతులు కూడా ఈ కార్యక్రమంలో వధువరులతో పాటు ఆడిపాడారు. ఎంతో ఘనంగా జరిగిన ఈ సంగీత్ కార్యక్రమంలో అర్చన, జగదీష్ తల్లిదండ్రులు, బంధువులు, స్నేహితులు కూడా పాల్గొని సందడి చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇష్టం లేని పెళ్లి చేయొద్దంటే వింటే కదా! 27మందికి పాలలో ఎలుకల మందు కలిపిచ్చిన యువతి!

Amaravati: అమరావతికి 20,494 ఎకరాల భూ సమీకరణకు సీఆర్డీఏ ఆమోదం

అక్రమ సంబంధం.. ప్రియుడి కోసం భర్తను గొంతు నులిమి చంపేసిన భార్య

Navi Mumbai: భార్య, అత్తలతో నగ్నంగా క్షుద్రపూజలు.. ఆపై ఫోటోలు లీక్ చేశాడు..

Microsoft: పాకిస్తాన్‌లో మైక్రోసాఫ్ట్ ఆఫీసుకు తాళం.. కారణం ఇదే..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments