Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాములో రాముల సాంగ్ మిస్.. అయినా రాహుల్‌కు సూపర్ ఛాన్స్

Webdunia
గురువారం, 14 నవంబరు 2019 (12:25 IST)
బిగ్ బాస్ హౌస్‌లో వున్నప్పుడు రాహుల్ సిప్లగింజ్ మంచి పాటలు వదిలేసుకున్నాడు. అందులో ముఖ్యమైనది ''రాములో రాముల''. అల వైకుంఠపురములో చిత్రంలోని ఈ సాంగ్ ను మొదట రాహుల్ చేత పాడిద్దామనుకున్నాడు తమన్. అయితే రాహుల్ బిగ్ బాస్ హౌజ్ లో ఉండిపోవడంతో, దీపావళికి సాంగ్ రిలీజ్ చేయాలని ఫిక్స్ అవ్వడంతో అనురాగ్ కులకర్ణి చేత పాడించాడు. 
 
రాహుల్ పాడి ఉంటే ఎలా ఉండేదో కానీ అనురాగ్ మాత్రం ఈ పాటకు పూర్తి న్యాయం చేశాడు. రాములో రాముల సూపర్ డూపర్ హిట్ అయింది. ఆ పాట హిట్ అవ్వడానికి సింగర్, మ్యుజిషియన్, లిరిక్ రైటర్‌తో పాటు మ్యూజిక్ వీడియో కూడా ప్రముఖ పాత్ర పోషించింది. ఇప్పటిదాకా లిరికల్ వీడియోస్‌కు అలవాటు పడిన జనాలకు ఈ మ్యూజిక్ వీడియోస్ బాగా అట్ట్రాక్ట్ చేస్తోంది. 
 
అల వైకుంఠపురములో నుండి విడుదలైన రెండు పాటలకు కూడా భీభత్సమైన రెస్పాన్స్ వచ్చిన కారణంగా ఈ చిత్రంలో అన్ని పాటలు కూడా ఇలా మ్యూజిక్ వీడియోస్ చేయాలని నిర్ణయించుకున్నారు. మరోవైపు ఇప్పుడు రాహుల్‌కు ఫేమ్‌ ను క్యాష్ చేసుకునేందుకు అతని చేత పాట పాడించి మ్యూజిక్ వీడియో చేయాలని సినిమా జనాలు అనుకుంటున్నారు. 
 
తాజాగా రాహుల్‌కు మరో మంచి అవకాశం తలుపు తట్టినట్లు తెలుస్తోంది. సరిలేరు నీకెవ్వరు చిత్రంలో రాహుల్ చేత ఒక మంచి పాట పాడించే ప్రయత్నాల్లో ఉన్నాడట దేవి శ్రీ ప్రసాద్.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కన్నడ నటి రన్యా రావు బెయిల్ పిటిషన్‌‌పై విచారణ : ఏప్రిల్ 17కి వాయిదా

తిరుపతి-కాట్పాడి రైల్వే లైన్: ప్రధానికి కృతజ్ఞతలు తెలిపిన ఏపీ సీఎం చంద్రబాబు

పోలీసుల బట్టలు ఊడదీసి నిలబెడతానన్న జగన్: అరటి తొక్క కాదు ఊడదీయడానికి...

అనన్ త పద్ చాయే ట్రెండ్ సాంగ్‌కు డ్యాన్స్ చేసిన తమిళ విద్యార్థులు (video)

ప్రకాశం బ్యారేజ్‌లో దూకేసిన మహిళ - కాపాడిన ఎన్డీఆర్ఎఫ్.. శభాష్ అంటూ కితాబు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

తర్వాతి కథనం
Show comments