Webdunia - Bharat's app for daily news and videos

Install App

విలన్ పాత్ర చేయడానికి 300 సినిమాల్లో నటించాల్సివచ్చింది : సునీల్

Webdunia
సోమవారం, 13 డిశెంబరు 2021 (13:01 IST)
తాను విలన్ పాత్రలను చేయడానికి ఏకంగా 300 సినిమాల్లో నటించాల్సివచ్చిందని ప్రముఖ హాస్య నటుడు, హీరో సునీల్ అన్నారు. అల్లు అర్జున్ - కె.సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం "పుష్ప". ఈ చిత్రం ఈ నెల 17వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో చిత్రం ప్రిరిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ నగరంలో ఆదివారం రాత్రి నిర్వహించారు. ఈ చిత్రంలో సునీల్ విలన్ పాత్రలో కనిపించనున్నారు.
 
దీనిపై సునీల్ మాట్లాడుతూ, సాధారణంగా విలన్ కావాలనుకుంటే ఆ దిశగా గట్టి ప్రయత్నాలు చేస్తే ఓ ఆరేడేళ్ళలో విలన్ అయిపోతారు. కానీ, నేను విలన్ కావడానికి ముందు కమెడియన్‌గా 300 సినిమాలు చేయాల్సివచ్చింది. హీరోగా ఓ పది సినిమాలు చేశాను. ఈ సారి మాత్రం మిమ్మల్ని కాస్త భయపెడుతాను.. మీరు కూడా భరించండి. అంతే. అని అన్నారు. 
 
అదేసమయంలో గతంలో సునీల్ అనే కమెడియన్ లేదా హీరో చేసిన పాత్రలను గుర్తుపెట్టుకుని ఈ సినిమాను చూడొద్దు. 'పుష్ప'లో సునీల్ పాత్ర అనే కోణంలోనే ఆలోచన చేస్తూ సినిమాను చూడాలని కోరారు. ఇతర భాషల్లో నేను కనిపించడం ఇదే తొలిసారి. సో.. అక్కడ నాకు టెన్షన్ లేదు. కానీ, నా టెన్షన్ అంతా తెలుగులోనే. ఎందుకంటే ఈ సునీల్ ఇప్పటివరకు కనిపించిన సునీల్ వేరు.. 'పుష్ప' సినిమాలో కనిపించబోయే సునీల్ వేరు అని అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ట్రాఫిక్ పోలీస్ నుంచి తప్పించుకునే యత్నంలో బైకర్ అనంతలోకాలకు...

ఏపీలో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు... ఐఎండీ హెచ్చరిక

మూడు రోజుల క్రితం వివాహం... రౌడీ షీటర్ నడి రోడ్డుపై హత్య

క్షేమంగా ఇంటికి చేరుకున్న మార్క్.. శ్రీవారికి తలనీలాలు సమర్పించిన అన్నా లెజినోవా

ప్రియురాలి భర్తను చంపేందుకు సుపారీ గ్యాంగ్‌తో కుట్ర... చివరకు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments