Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

యండమూరి - అతడు ఆమె ప్రియుడు- టీజర్ బాగుంద‌న్న మంత్రి అవంతి శ్రీనివాస్

Advertiesment
యండమూరి - అతడు ఆమె ప్రియుడు- టీజర్ బాగుంద‌న్న మంత్రి అవంతి శ్రీనివాస్
, శుక్రవారం, 3 డిశెంబరు 2021 (20:05 IST)
Yandamuri - Athadu ame priyudu - teaser launched Avanti Srinivas
హీరో సునీల్, బిగ్ బాస్ ఫేమ్ కౌశల్, బెనర్జీ ముఖ్య పాత్రల్లో న‌టిస్తున్న చిత్రం "అతడు ఆమె ప్రియుడు`. యండమూరి వీరేంద్రనాధ్ దర్శకత్వం వహించారు. రవి కనగాల-రామ్ తుమ్మలపల్లి సంయుక్తంగా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ విభిన్న కథా చిత్రం ఫస్ట్ కాపీ సిద్ధమైంది. త్వరలో విడుదల కానున్న ఈ చిత్రం టీజర్ విడుదల కార్యక్రమం వైజాగ్-అవంతి కాలేజీలో అత్యంత ఘనంగా నిర్వహించారు.
 
మంత్రివర్యులు-అవంతి సంస్థల అధినేత ముత్తంశెట్టి శ్రీనివాసరావు ముఖ్య అతిధిగా హాజరై టీజర్ ఆవిష్కరించి "అతడు ఆమె ప్రియుడు" అద్భుత విజయం సాధించాలని ఆకాంక్షించారు. 
చిరంజీవి నటించిన పలు బ్లాక్ బస్టర్స్ కు కథలు అందించిన తాను ఆయనకు పెద్ద ఫ్యాన్ అని ఈ సందర్భంగా యండమూరి పేర్కొన్నారు. నిర్మాతలు రవి కనగాల-తుమ్మలపల్లి రామ్ ఖర్చుకు వెనకాడకుండా "అతడు ఆమె ప్రియుడు" చిత్రాన్ని నిర్మించారని తెలిపారు.
 
 కె.రాఘవేంద్రరావు విడుదల చేసిన "అతడు ఆమె ప్రియుడు" ఫస్ట్ లుక్ కి అనూహ్య స్పందన లభించిందని, మంత్రివర్యులు అవంతి శ్రీనివాసరావు రిలీజ్ చేసిన టీజర్ కు కచ్చితంగా మరింత మంచి స్పందన వస్తుందనే నమ్మకం ఉందని నిర్మాతలు రవి కనగాల-తుమ్మలపల్లి రామ్ పేర్కొన్నారు.
 
 అతి త్వరలో విడుదలకు సిద్ధమవుతున్న ఈ చిత్రానికి పి.ఆర్.ఓ: ధీరజ్-అప్పాజీ, కెమెరా: మీర్, నిర్మాణ సారధ్యం: అమర్, సమర్పణ: శ్రీమతి కూనం కృష్ణకుమారి, నిర్మాతలు: రవి కనగాల-రామ్ తుమ్మలపల్లి, కథ-మాటలు-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: యండమూరి వీరేంద్రనాధ్.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తెలంగాణ ప్ర‌భుత్వం అంద‌ర్నీ క‌డుపులో పెట్టుకుని చూసుకుంటుంది - త‌ల‌సాని