కథానాయకుడు గోపీచంద్‌కు కరోనా తర్వాత కలిసివస్తందనేపిస్తుంది. ప్రస్తుతం ఆయన మూడు సినిమాలు రెడీగా వున్నాయి. అందులో చాలాకాలంనాడు చక్కటి కథాంశంతో కష్టపడి చేసిన సినిమా `ఆరడుగుల బుల్లెట్. నయనతారా హీరోయిన్. బి.గోపాల్ దర్శకుడు. ఈ సినిమా ఇప్పటికీ విడుదలకు సిద్ధమైంది. ఇందుకు పరిస్థితులు కూడా అనుకూలించినట్లున్నాయి. జయబాలజీ రీల్ మీడియా ప్రైవేట్ లిమిలెట్ పతాకంపై తాండ్ర రమేష్ నిర్మించారు.
ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. థియేటర్స్ రీ ఓపెన్ కాగానే ఆరడుగుల బుల్లెట్` చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా నిర్మాత తాండ్ర రమేష్ ఓన్ రిలీజ్ చేస్తుండటం విశేషం. త్వరలోనే సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్‌ను స్టార్ట్ చేసి విడుదల తేదీ వంటి విషయాలపై పూర్తి వివరాలు తెలియజేయనున్నారు. గోపిచంద్, నయనతార కాంబినేషన్, బి. గోపాల్ డైరెక్షన్, వక్కంతం వంశీ కథ, మణిశర్మ మ్యూజిక్ ఈ సినిమాకు హైలెట్ కానున్నాయని నిర్మాత రమేష్ తెలిపారు. ఇంకా ప్రకాష్‌రాజ్, బ్రహ్మానందం, అభిమన్యు సిన్హా తదితరులు నటించారు.