Webdunia - Bharat's app for daily news and videos

Install App

`వ‌ద్దురా సోదరా`తో తెలుగులో క‌న్న‌డ రుషి

Webdunia
సోమవారం, 21 జూన్ 2021 (11:16 IST)
Kannada actor Rish
కన్నడ న‌టుడు రిషి తెలుగులో ఎంట్రీ ఇస్తున్న సినిమా "వద్దురా సోదరా". ఈ చిత్రంలో ధన్య బాలకృష్ణన్ నాయికగా నటిస్తోంది. ఓ వినూత్న ప్రేమకథతో దర్శకుడు ఇస్లాహుద్దీన్ ఈ చిత్రాన్ని రూపొందించారు. కన్నడ, తెలుగు ద్విభాషా చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమాను స్వేచ్ఛా క్రియేషన్స్, స్టాబ్ ఫాబ్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా తెలుగులోకి తీసుకొస్తున్నాయి. ధీరజ్ మొగిలినేని, అమ్రేజ్ సూర్యవంశీ నిర్మాతలు.
 
సోమవారం ఉదయం 8 గంటలకు "వద్దురా సోదరా" సినిమా మోషన్ పోస్టర్ రిలీజ్ అయ్యింది. ఈ మోషన్ పోస్టర్ చూస్తే..ప్రేయసికి దూరమైన ఓ ప్రేమికుడు తన బాధను వ్యక్తం చేస్తూ వాయిస్ ప్రారంభమైంది. నా ప్రేయసి తనకు ఇష్టంలేని వాడిని పెళ్లి చేసుకున్నప్పుడు నేను లేకుండా తను ఎప్పుడూ సంతోషంగా ఉండలేనని చెప్పింది. అప్పటి నుంచి నేను కూడా సంతోషంగా ఉండటం మానేశాను. కానీ ఇప్పుడు ఒక సంతోషపు ముసుగు వేసుకుని బ్రతుకుతున్నాను. పైకి సంతోషంగా లోపల బాధతో మిగిలిపోయాను. అని చెబుతూ ముగించారు. కథానాయకుడు రిషి ఒక కుర్చీకి బంధించుకోవడం వెనక సింబాలిక్ రీజన్ ఏంటో సినిమాలో చూడాలి.
 
నాగభూషణ, గ్రీష్మ శ్రీధర్, మహదేవ్ ప్రసాద్, భవానీ ప్రకాష్, అపూర్వ ఎస్ భరద్వాజ్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ - విష్ణు ప్రసాద్ పి, దిలీప్ కుమార్ ఎంఎస్, ఎడిటింగ్ - గురుస్వామి టి, సంగీతం - ప్రసన్న శివరామన్, బ్యానర్స్ - స్వేచ్ఛా క్రిేయషన్స్, స్టాబ్ ఫాబ్ ప్రొడక్షన్స్, నిర్మాతలు - ధీరజ్ మొగిలినేని, అమ్రేజ్ సూర్యవంశీ, రచన, దర్శకత్వం - ఇస్లాహుద్దీన్.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇండోనేషియాలో భారీ భూకంపం : సునామీ హెచ్చరికలా?

మహిళా రోగితో అసభ్యంగా ప్రవర్తించిన వార్డ్ బాయ్ అరెస్టు

ఏపి రాజధాని అమరావతిలో 35 ఎకరాల్లో నూతన ఏఐ క్యాంపస్‌ను ప్రారంభించనున్న బిట్స్ పిలానీ

IIT alumini: పీస్ ఆఫ్ మైండ్ లేదని రూ. 1 కోటి ఉద్యోగాన్ని వదిలేశాడు, ఇప్పుడేమి చేస్తున్నాడో తెలుసా?

కాంగ్రెస్ నేత ప్రాణం తీసిన వివాహేతర సంబంధం - రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్న మహిళ భర్త - కొడుకు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

శ్వాసనాళ సంబంధ వ్యాధులకు కారణమయ్యే రెస్పిరేటరీ సింశైషియల్ వైరస్‌పై అవగాహన, టీకాల అవసరం

వాతావరణ మార్పులు నిశ్శబ్ద డిహైడ్రేషన్‌కి దారితీస్తోంది: వైద్యులు హెచ్చరికలు

తర్వాతి కథనం
Show comments