Webdunia - Bharat's app for daily news and videos

Install App

'ఆర్ఆర్ఆర్' నుంచి క్రేజీ అప్‌డేట్స్ : ఫ్యాన్స్‌కు నిరాశ తప్పదా?

Webdunia
ఆదివారం, 20 జూన్ 2021 (10:43 IST)
దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం 'ఆర్ఆర్ఆర్'. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు హీరోలుగా నటిస్తున్నారు. అయితే, 'బాహుబలి' తర్వాత రాజమౌళి తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం కోసం అమితాసక్తితో ఎదురు చూస్తున్నారు. 
 
అయితే కోవిడ్‌ కారణంగా ఆలస్యమవుతోంది. ఇపుడు సరికొత్త వార్త ఒకటి ప్రచారంలోకి వచ్చింది. ఆర్ఆర్ఆర్ రిలీజ్‌పై టాలీవుడ్ సర్కిల్స్‌లో కొత్త డేట్లు వైరల్ అవుతున్నాయి. కరోనా సెకండ్ వేవ్‌ కారణంగా షూటింగ్‌లు వాయిదా పడటంతో ముందు చెప్పినట్టుగా అక్టోబర్‌లో సినిమా రిలీజ్ చేయటం కష్ట సాధ్యమేనని చిత్ర యూనిట్ భావిస్తోంది. 
 
పైగా, షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్, ప్రమోషన్‌ ఇలా చాలా వర్క్‌ ఉంది. అందుకే ట్రిపులార్ రిలీజ్ అక్టోబర్‌లో అయితే ఉండదని ఫిక్స్‌ అయ్యారు. భారీ చిత్రం కావటంతో సరైన సీజన్‌లో సినిమాను రిలీజ్ చేయాలన్న ధోరణిలో నిర్మాత ఉన్నారు. మరోసారి డేట్ మార్చే అవసరం లేకుండా ఉండేలా… కాస్త ఆలస్యంగానే సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. 
 
ఇందులోభాగంగా, ఏకంగా 8 నెలల పాటు రిలీజ్ వాయిదా వేసే ప్లాన్‌లో ట్రిపులార్ టీమ్‌ ఉన్నట్టుగా తెలుస్తోంది. అక్టోబర్‌లో కాకుండా 2022 సమ్మర్‌ కానుకగా సినిమాను రిలీజ్ చేసే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఏప్రిల్‌ నెలలో రిలీజ్ చేస్తే కలెక్షన్ల పరంగా కూడా సినిమాకు ప్లస్ అవుతుందన్న ఆలోచనలో దర్శకనిర్మాత ఉన్నట్టు తెలుస్తోంది. అయితే, ఈ వార్తల్లో నిజమెంతో తెలియాలంటే చిత్ర యూనిట్ స్పందించాల్సివుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భర్త నాలుకను కొరికేసిన భార్య... ఎందుకో తెలుసా?

Viral Post from NTR Trust: ఆరోగ్య సమస్యలను తగ్గించే ఆహార పదార్థాల జాబితా

భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడనీ ప్రియుడుని 20 సార్లు కత్తితో పొడిచిన భర్త!!

స్వర్ణదేవాలయంలో మంత్రి నారా లోకేశ్ దంపతుల ప్రార్థనలు

అమెరికాలో మిస్సైన తెలుగు యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు.. కారణం అదే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments