Webdunia - Bharat's app for daily news and videos

Install App

అందం వుంది కానీ.. ఆ హీరోయిన్‌కు ఆ వ్యాధి.. (video)

Webdunia
మంగళవారం, 24 నవంబరు 2020 (10:29 IST)
Malavika sharma
అందం, ఆస్తులు వున్నా కొందరికి రోగాలు వెంటాడుతూ వుంటాయి. నిన్నటికి నిన్న రానా తన ఆరోగ్య పరిస్థితిపై సమంత షోలో చెప్పిన నేపథ్యంలో... తాజాగా హీరోయిన్ మాళవికా శర్మ కూడా తనకున్న రోగం గురించి వెల్లడించింది. ఈ వార్త విని ప్రస్తుతం సినీ ప్రేక్షకులు షాకయ్యారు. ఈ మాళవిక శర్మ ఎవరంటే..? నేల టిక్కెట్ సినిమాలో రవితేజకు హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమాతోనే టాలీవుడ్‌లో మంచి పేరుతెచ్చుకుంది. 
 
ప్రస్తుతం వరుస ఆఫర్లతో ముందుకు దూసుకెళ్తుంది. అంతేకాకుండా రామ్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా రెడ్‌లో కూడా చాన్స్ కొట్టేసింది. ఈ సినిమా పూర్తకాకముందే ఈ అందాల రాసికి మరో రెండు ఆఫర్లు క్యూలో ఉన్నాయి. వచ్చే వేసవిలోపు మరో రెండు తెలుగు సినిమాల్లో మాళవికా చేయనుంది. అయితే సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే మాళవికా ఇటీవల ఫాన్స్‌కు గుండె పగిలే నిజాన్ని ఎంతో సింపుల్‌గా నవ్వుతూ చెప్పేసింది. ఆమె మానసిక రుగ్మత గురించి అభిమానులకు తెలిపింది. దీంతో ఆమె అభిమానులు ఆశ్యర్యపోయారు. 
 
ఈ ముద్దుగుమ్మ క్లెప్లమెనియాక్ అనే చిత్రమైన మానసిక సమస్యతో బాధపడుతోందట. ఈ సమస్య ఉన్న వారికి చిన్న చిన్న వస్తువుల దగ్గర నుంచి పెద్ద పెద్ద దొంగతనాలు చేయాలని అనిపిస్తుందట. ఏదైనా వస్తువు కళ్ల ముందు కనిపిస్తే చాలు దాన్ని దొంగతనం చేయాలని మనసు తెగ పీకులాడుతుంది. ఇది చాలా అరుదుగా ఉంటుంది. ఈ రోగం దాదాపు అందరిలో ఉన్నా, అంత సమస్యగా మారదు. కానీ ఒక హీరోయిన్‌కు ఇది ఉండటం చిన్న విషయం కాదు. 
 
ఈ సమస్య కారణంగా తాను ఎన్నోసార్లు ఇబ్బంది పడ్డానని మాళవిక చెప్పింది. తన వెంట ఎవరైన ఉండి ఎప్పటికప్పుడు తన మనసును పక్క దారి పట్టిస్తూ ఉండటంతో పాటు నా మానసి స్థితిని గుర్తు చేస్తుంటారని మాళవిక వెల్లడించింది.
 

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments