Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

24-11-2020 మంగళవారం దినఫలాలు - కార్తికేయస్వామికి పూజ చేస్తే... (video)

Advertiesment
24-11-2020 మంగళవారం దినఫలాలు - కార్తికేయస్వామికి పూజ చేస్తే... (video)
, మంగళవారం, 24 నవంబరు 2020 (05:00 IST)
మేషం : ప్రింటింగ్ రంగాల వారికి ఒత్తిడి అధికం. స్త్రీలు, పూజా కార్యక్రమాలలో పాల్గొంటారు. కోర్టు వ్యవహారాలు వాయిదా వేయటం శ్రేయస్కరం. కొబ్బరి, పండ్లు, పూలు, కూరగాయల వ్యాపారులకు లాభదాయకం. గృహమునకు కావాల్సిన వస్తువులను కొనుగోలు చేస్తారు. బ్యాంకు వ్యవహారాలలో సమస్యలు తలెత్తుతాయి. 
 
వృషభం : విదేశాలు వెళ్లడానికి చేయు ప్రయత్నాలు అనుకూలిస్తాయి. సోదరీ, సోదరుల మధ్య అవగాహన ఏర్పడుతుంది. ఉద్యోగస్తులు కొత్త బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తారు. స్త్రీలలో నూతనోత్సాహం చోటుచేసుకుంటుంది. కొంతమంది మీతో సఖ్యగా ఉంటూనే మీపై అభాండాలు వేయడానికి ప్రయత్నిస్తారు. 
 
మిథునం : సంఘంలో మీ మాట, తీరుకు మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. రాజకీయాల్లో వారు సంక్షోభాన్ని ఎదుర్కొంటాు. రావలసిన ధనంలో కొంత మొత్తం వసూలు కాగలదు. భాగస్వామిక చర్చల్లో మీ ప్రతిపాదనలకు ఆమోదం లభిస్తుంది. చేపట్టిన పనులు ఎంతకీ పూర్తికాక చేసిన పనులే మళ్లీ చేయవలసి వస్తుంది. 
 
కర్కాటకం : మార్కెటింగ్, ప్రైవేట్ సంస్థల్లో వారికి యాజమాన్యం తీరు ఆందోళన కలిగిస్తుంది. ఆత్మీయుల భరోసా మీకు సంతృప్తినిస్తుంది. వైద్యులకు ఆపరేషన్లు చేయునపుడు ఏకాగ్రత అవసరం. పత్రికా సంస్థలలోని వారికి మార్పులు అనుకూలిస్తాయి. కుటుంబీకుల మధ్య సంబంధ బాంధవ్యాలు బలపడతాయి. 
 
సింహం : ఉపాధ్యాయులకు విద్యార్థుల వల్ల ఒత్తిడి, చికాకులు ఎదుర్కొంటారు. వాహనం నడుపునపుడు మెళకువ అవసరం. మీ కోసం, మీ కుటుంబీకుల కోసం ధనం బాగుగా వెచ్చిస్తారు. వీలైనంత వరకూ మీ పనులు మీరే చేసుకోవడం ఉత్తమం. ఐటీ రంగాల్లో వారికి మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉంది. 
 
కన్య : స్త్రీలు నరాలు, దంతాలు, ఎముకలకు సంబంధించిన చికాకులను ఎదుర్కొంటారు. భాగస్వామ్యుల మధ్య ఒడిదుడుకులు తలెత్తగలవు. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి ఒత్తిడి, చికాకులు తప్పవు. రావలసిన బాకీలు అతికష్టంమ్మీద వసూలవుతాయి. ఉద్యోగం నిమిత్తం ఆకస్మికంగా ప్రయాణం చేయవలసి ఉంటుంది. 
 
తుల : ఉద్యోగస్తుల నిర్లక్ష్యం వల్ల అధికారుల నుంచి మాటపడవలసి వస్తుంది. ఉత్తర ప్రత్యుత్తరాలు సమర్థంగా నిర్వహిస్తారు. దూర ప్రయాణాల్లో మెళకువ అవసరం. మీ ఆవేశం, అవివేకం వల్ల వ్యవహారం చెడే ఆస్కారం ఉంది. ఊహాగానాలతో కాలం వ్యర్థం చేయవద్దు. ప్రముఖుల కలయిక మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. 
 
వృశ్చికం : మీ ఔదార్యాన్ని కొంతమంది దుర్వినియోగం చేసే అవకాశం ఉంది. జాగ్రత్త వహించండి. నిత్యావసర వస్తు వ్యాపారస్తులకు, స్టాకిస్టులకు కలిసిరాగలదు. మీ సహోద్యోగులతో సరదాగా గడపగలరు. నిరుద్యోగులకు మంచి మంచి అవకాశాలు లభిస్తాయి. కొత్త పరిచయస్తులతో అతి చనువు మంచిదికాదు. 
 
ధనస్సు : రాజకీయ, కళా రంగాల్లో వారికి అరుదైన ఆహ్వానాలు లభిస్తాయి. పట్టుదలతో అనుకున్నది సాధించి, విమర్శలకు ధీటుగా నిలుస్తారు. ఇప్పటివరకు ఆగివున్న పనులు పునఃప్రారంభమవుతాయి. బంధు మిత్రులలో మీ మాటకు, వ్యక్తిత్వానికి గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాభివృద్ధికి మరింతగా శ్రమించాల్సి వుంటుంది. 
 
మకరం : ఆదాయం బాగున్నా ఏదో తెలియని అసంతృప్తి. అసహనానికి లోనవుతారు. తొందరపాటు చర్చలు, మాటజారటం వల్ల ఇబ్బందులెదుర్కొంటారు. విరోధులు వేసే పథకాలు తెలివితో తిప్పి గొట్టగలుగుతారు. గృహ నిర్మాణానికి కావలసిన ప్లాన్లకు ఆమోదం లభిస్తుంది. విద్యార్థులలో చురుకుదనం కానరాగలదు. 
 
కుంభం : ఆర్థిక లావాదేవీలు, కుటుంబ వ్యవహారాలు సమర్థంగా నిర్వహిస్తారు. విదేశీయానం కోసం చేసే యత్నాల్లో సఫలీకృతులవుతారు. ప్రింటింగ్ రంగాల వారికి ఒత్తిడి తప్పదు. స్త్రీలకు అర్జన పట్ల ఆసక్తి పెరుగుతుంది. మొండిబాకీలు వసూలుకాగలవు. ఉద్యోగం నిమిత్తం ఆకస్మికంగా ప్రయాణం చేయవలసి వస్తుంది. 
 
మీనం : వైద్యులు ఆపరేషన్లు చేయునపుడు ఏకాగ్రత, మెళకువ అవసరం. వ్యవసాయ, తోటల రంగాల్లో వారికి ఊహించని ఇబ్బందులు ఎదుర్కొంటారు. మీ సంతానం మొండివైఖరి మీకు చికాకు కలిగిస్తుంది. పెంపుడు జంతువుల గురించి ఆందోళన చెందుతారు. సోదరులతో పరస్పర అవగాహన లోపం తలెత్తవచ్చు. 

 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

'అక్షయ నవమి' నేడే.. ఏదీ చేసినా రెట్టింపు ఫలితం.. ఉసిరిని దానం చేస్తే?