Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

20-11-2020 శుక్రవారం దినఫలాలు - ఇష్టకామేశ్వరి దేవిని పూజించడం వల్ల..

webdunia
శుక్రవారం, 20 నవంబరు 2020 (05:00 IST)
మేషం : బంగారు వ్యాపారులకు అనుకోని సమస్యలు ఎదురవుతాయి. ఆలయ సందర్శనాలలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. విందుల్లో పరిమితి పాటించండి. విద్యార్థులు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది. ఉద్యోగస్తులు మార్పులకై చేయు ప్రయత్నాలు కలిసిరాగలవు. ఇంటి రుణారు కొన్ని తీరుస్తారు.
 
వృషభం : ఉన్నతంగా ఎదగాలనే మీ లక్ష్యానికి చేరువ అవుతారు. మీ చిన్నారుల కోసం నూతన పథకాలు వేసి జయం పొందగలరు. కోర్టు వ్యహారాల్లో ఫ్లీడర్ల తీరు ఆందోళన కలిగిస్తుంది. విదేశీ యత్నాలు అనుకూలిస్తాయి. గొప్ప, గొప్ప అవకాశాలు మీ దరిచేరతాయి. హోటల్, క్యాటరింగ్ పనివారలకు కలిసిరాగలదు. 
 
మిథునం : కొబ్బరి, పండ్లు, పూలు, చిరు వ్యాపారులకు కలిసిరాగలదు. పెద్దలతో పట్టింపులు సంభవిస్తాయి. భాగస్వాములతో విభేదాలు తలెత్తే ఆస్కారం ఉంది. లిటిగేషన్ వ్యవహారాల్లో జాగ్రత్త వహించండి. ప్రభుత్వ మూలక ఇబ్బందులు ఎదురవుతాయి. స్థిరాస్తి క్రయ విక్రయాలకు సంబంధించిన వ్యవహారాలలో మెళకువ వహించండి. 
 
కర్కాటకం : రాజకీయ నాయకులు తరచూ సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. ఎవరికైనా ధనం సహాయం చేసినా తిరిగిరాజాలదు. మీ అభిరుచి ఆశాయలకు తగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. బ్యాంకులు ఆర్థిక సంస్థలతో పనులు పూర్తవుతాయి. మీ సంతానం మొండివైఖరి వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు.
 
సింహం : నేడు చేజారి అవకాశం రేపు కలిసివస్తుంది. వైవాహిక జీవితంలో అనుకోని చికాకులు తలెత్తుటకు ఆస్కారం ఉంది. జాగ్రత్త వహించండి. దైవ దర్శనానికి చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి. గృహోపకరణాలు, వాహనం, విలువైన వస్తువులు అమర్చుకుంటారు. రావలసిన ధనంలో కొంత మొత్తం వసూలు కాగలదు.
 
కన్య : ఉపాధ్యాయులకు విద్యార్థుల వల్ల సమస్యలు తలెత్తే ఆస్కారం ఉంది. జాగ్రత్త వహించండి. సోదరీ, సోదరుల మధ్య మనస్పర్థలు తలెత్తుతాయి. దైవదర్శనాలను త్వరగా ముగించుకుంటారు. స్త్రీలు తొందరపాటుతనం వల్ల ప్రియతములను దూరం చేసుకుంటారు. నిరుద్యోగులు ఒక ప్రకటన పట్ల ఆకర్షితులవుతారు. 
 
తుల : కొత్త పనులు చేపట్టకుండా చేస్తున్నవాటిపైనే శ్రద్ధ వహించండి. దూర ప్రయాణాలలో వస్తువుల పట్ల మెళకువ అవసరం. ప్రముఖ ఆలయాల్లో దైవదర్శనాలు అతికష్టంమ్మీద అనుకూలిస్తాయి. వీలైనంత వరకు బయటి ఆహారాన్ని భుజించకండి. స్త్రీలతో సంభాషించేటపుడు సంయమనం పాటించండి. 
 
వృశ్చికం : ప్రింటింగ్ రంగాల వారికి బకాయిల వసూళ్ళలో శ్రమాధిక్య, ప్రయాసలు తప్పవు. రాజకీయ నాయకులకు ఊహించని మార్పులు చోటుచేసుకుంటాయి. ఊహాగానాలతో కాలం వ్యర్థం చేయక సత్ కాలంను సద్వినియోగం చేసుకోండి. నిర్మాణ పనులలో కాంట్రాక్టర్లకు ఏకాగ్రత స్వయం పర్యవేక్షణ ఎంతో ముఖ్యం. 
 
ధనస్సు : హోటల్, కేటరింగ్ రంగాల్లో వారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. ప్రయాణాలు ఖర్చులకు సంబంధించిన వ్యూహాలు అమలు చేస్తారు. మీ సృజనాత్మక శక్తికి, మీ తెలివి తేటలకు మంచి గుర్తింపు లభిస్తుంది. ప్రలోభాలకు లొంగవద్దు. ఉద్యోగ వ్యాపారులకు అధికారుల నుంచి ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. 
 
మకరం : ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి విమర్శలను ఎదుర్కొంటారు. వైద్యులు ఆపరేషన్లను విజయవంతంగా పూర్తి చేస్తారు. పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. మీకు దగ్గరగా ఉన్న మీకే తెలియని ఒక అవకాశం మిమ్మల్ని వరిస్తుంది. స్త్రీల పట్టుదల వల్ల కుటుంబ సౌఖ్యం అంతగా ఉండదు.
 
కుంభం : మీ సృజనాత్మక శక్తికి, మీ తెలివి తేటలకు మంచి గుర్తింపు లభిస్తుంది. వస్త్ర వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని ఉండటం శ్రేయస్కరం. ఏదో సాధించలేకపోయామన్న భావం మిమ్మల్ని వెంటాడుతుంది. ఖర్చులు అధికమవుతాయి. ఒక్కోసారి మీ జీవిత భాగస్వామి మనస్తత్వం అర్థం చేసుకోవడం కష్టమవుతుంది. 
 
మీనం : ఎంత ధనం వెచ్చించైనా కోరుకున్న వస్తువు దక్కించుకుంటారు. కాంట్రాక్టర్లకు ఏకాగ్రత, స్వయం పర్యవేక్షణ ఎంతో ముఖ్యం. రాజకీయ నాయకులకు ఊహించని మార్పులు చోటుచేసుకుంటాయి. మీ అభిరచి, ఆశయాలకు తగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ముఖ్యంగా, ప్రింట్, మీడియాలో ఉన్నవాళ్లు జాగ్రత్తగా ఉండాలి. 

Share this Story:

Follow Webdunia Hindi

తర్వాతి కథనం

దత్తాత్రేయ స్తోత్రాలతో సమస్యలు పరార్.. గురువారం పఠిస్తే..?