Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

23-11-2020 సోమవారం దినఫలాలు - మల్లికార్జున స్వామిని ఆరాధించడం వల్ల...

webdunia
సోమవారం, 23 నవంబరు 2020 (05:00 IST)
మేషం : ఉద్యోగస్తులు కొత్త బాధ్యతలు సమర్థంగా నిర్వహిస్తారు. నిరుద్యోగులు భేషజాలకు పోకుండా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం మంచిది. సొంతంగా వ్యాపారం చేయాలనే మీ సంకల్పం కార్యరూపం దాల్చుతుంది. స్త్రీలకు బంధువర్గాలతో పట్టింపులు ఎదురవుతాయి. పెద్దల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. 
 
వృషభం : ఒక వ్యవహారం నిమిత్తం న్యాయవాదులతో సంప్రదింపులు జరుపుతారు. ఉద్యోగస్తులు ప్రతి విషయంలోనూ ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. చిన్నతరహా పరిశ్రమలు, చిరు వ్యాపారులకు ఆశాజనకం. స్త్రీలకు స్వీయ సంపాదన పట్ల ఆసక్తి ఏర్పడుతుంది. ఆపద సమయంలో మిత్రులుగా అండగా నిలుస్తారు.
 
మిథునం : వృత్తులు, క్యాటరింగ్ పనివారలకు ఆశాజనకం. ఆలయాలను సందర్శిస్తారు. ఇతరుల విషయాలు, హామీలకు దూరంగా ఉండటం మంచిది. సమయానుకూలంగా మీ కార్యక్రమాలు మార్చుకోవాల్సి వస్తుంది. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అనుకూలిస్తాయి. ఒక ముఖ్య సమాచారం కోసం ఆసక్తి ఎదురుగా చూస్తారు. 
 
కర్కాటకం : వైద్యులు అరుదైన ఆపరేషన్లు విజయవంతంగా పూర్తి చేస్తారు. స్టాక్ మార్కెట్ రంగాల వారి అంచనాలు నిరుత్సాహపరుస్తాయి. కొంతమంది మీ ఆలోచనలు తప్పుదారి పట్టించేందుకు ఆస్కారం ఉంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్, కోరుకున్న చోటికి బదిలీ వంటి శుభవార్తలు అందుతాయి. ప్రముఖులను కలుసుకుంటారు. 
 
సింహం : సంస్థలు, పరిశ్రమల స్థాపనకు కావలసిన వనరులు సమకూర్చుకుంటారు. కోర్టు వ్యవహారాల్లో ఫ్లీడర్ల తీరు ఆందోళన కలిగిస్తుంది. మీ ఔన్నత్యాన్ని ఇతరులను గుర్తిస్తారు. తలపెట్టిన పనులు సకాలంలో పూర్తి కాగలవు. స్త్రీలతో మితంగా సంభాషించండి. విద్యార్థులకు పరిచయాలు, వ్యాపకాలు అధికమవుతాయి. 
 
కన్య : వ్యాపారాభివృద్ధికి చేపట్టిన పథకాలు, ప్రణాళికలు సత్ఫిలితాలనిస్తాయి. కృషి పట్టుదలతో శ్రమించి అనుకున్నది సాధిస్తారు. గృహంలో ఒక శుభకార్యానికి అనువైన పరిస్థితులు నెలకొంటాయి. నూతన షేర్ల కొనుగోలులో పునరాలోచన అవసరం. నిరుద్యోగులు ఇంటర్వ్యూల్లో విజయం సాధిస్తారు. ఖర్చులు అధికమవుతాయి. 
 
తుల : కుటుంబీకుల మధ్య ప్రేమానురాగాలు బలపడతాయి. బంధు మిత్రుల నుంచి ఆహ్వానాలు అందుకుంటారు. స్థిరచరాస్తుల విషయంలో ఏకాగ్రత అవసరం. నిదానంగానైనా మీరు చేపట్టిన ఉపాధి పథకాలకు మంచి గుర్తింపు, ప్రోత్సాహం లభించగలవు. రుణం తీర్చడానికి చేయు ప్రయత్నాలు ఫలించవు. 
 
వృశ్చికం : వృత్తి వ్యాపారులకు అన్ని విధాల కలిసిరాగలదు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటాయి. కాంట్రాక్టర్లకు రావలసిన బిల్లులు ఆలస్యంగా అందుతాయి. తోటల రంగాల వారికి దళారీల నుంచి వేధింపులు తప్పవు. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి లాభదాయకం. ప్రేమికుల అతి ప్రవర్తన అనర్థానికి దారితీస్తుంది. 
 
ధనస్సు : ఆరోగ్య, ఆహార వ్యవహారాల్లో అధికమైన జాగ్రత్త అవసరం. నిరుద్యోగులు చేపట్టిన ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. ఉద్యోగస్తులకు పనిభారం అధికం. దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఇతరుల ఆంతరింగిక విషయాలకు దూరంగా ఉండటం మంచిది. స్త్రీల ప్రతిభకు మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది.
 
మకరం : ద్విచక్ర వాహనంపై దూర ప్రయాణాు మంచిదికాదు. ఉన్నతస్థాయి అధికారులకు ఉపాధ్యాయులకు బదిలీ వార్తలు ఆందోళన కలిగిస్తాయి. వృత్తులు, ఏజెంట్లు, బ్రోకర్లకు శ్రమాధిక్యతేగానీ ప్రతిఫలం ఆశించినంతగా ఉండదు. రియల్ ఎస్టేట్ రంగాల వారికి స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి సదావకాశాలు లభిస్తాయి. 
 
కుంభం : ఉద్యోగస్తులకు రావలసిన ప్రమోషన్ విషయంలో ఆటంకాలు తొలగిపోతాయి. ఒక వ్యవహారం నిమిత్తం ఆకస్మికంగా ప్రయాణం చేయవలస వస్తుంది. పట్టుదలతో శ్రమించి అనుకున్నది సాధిస్తారు. ఖర్చులు, రాబడి విషయాలలో మెలకువ వహించండి. కొబ్బరి, పండ్లు, పూల పానీయ వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. 
 
మీనం : పత్రిక, ప్రైవేటు సంస్థలలోని వారికి మార్పులు అనుకూలించవు. రాబడికి మించిన ఖర్చులు ఎదురైనా ఆర్థిక వెసులుబాటు ఉంటుంది. విద్యార్థినులకు ప్రేమ వ్యవహారాల్లో చికాకులు తలెత్తుతాయి. శాస్త్ర, సాంకేతిక, వైద్య రంగాల వారికి ప్రోత్సాహం లభిస్తుంది. లీజు, ఏజెన్సీలు, కాంట్రాక్టుల విషయంలో పునరాలోచన మంచిది.

Share this Story:

Follow Webdunia Hindi

తర్వాతి కథనం

కార్తీక సోమవారం.. శునకానికి అలా జరిగింది.. వ్రతమాచరిస్తే..?