Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇది వేదవాక్కు అంటోన్న రజినీకాంత్ పెద్దన్నట్రైల‌ర్‌

Webdunia
గురువారం, 28 అక్టోబరు 2021 (18:38 IST)
Peddanna- Rajini
సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా హై యాక్షన్ ఓల్టేజ్‌తో రాబోతోన్న పెద్దన్న చిత్రం దీపావళి కానుకగా నవంబర్ 4న విడుదల కాబోతోంది. టాలీవుడ్‌ డిస్ట్రిబ్యూషన్ రంగంలో అగ్రగామి అయిన ఏసియన్ ఇన్ ఫ్రా ఎస్టేట్స్ ఎల్ఎల్‌పి సంస్థ అన్నాత్తె డబ్బింగ్ రైట్స్‌ను సొంతం చేసుకుంది. తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్‌లో నారాయణదాస్ నారంగ్, సురేష్ బాబు కలిసి ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించబోతోన్నారు.
 
నాలుగు రోజుల క్రితం విడుదల చేసిన టీజర్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇక ట్రైలర్‌ను రిలీజ్ చేసి పండుగను ముందే తీసుకొచ్చారు మేకర్స్. ఈ ట్రైలర్‌లో రజినీ మార్క్ డైలాగ్స్ ఎన్నో ఉన్నాయి. ఊరి పంచాయితీ పెద్దగా రజినీకాంత్ కనిపించబోతోన్నారు. అతని ముద్దుల చెల్లెలిగా కీర్తి సురేష్ నటించారు. ఇక రజినీ కాంత్ చెప్పిన డైలాగ్స్ అద్భుతంగా ఉన్నాయి. రెండు నిమిషాల నలభై సెక్లను ఉన్న ఈ ట్రైలర్‌లో రజినీ మేనియా మొత్తం కనిపించింది.
 
‘నువ్ ఎవరన్నది.. నువ్ వెనకేసున్న ఆస్తిలోనో,  నీ చుట్టూ ఉన్న మనిషుల్లోనూ లేదు..నువ్  చేసే చర్యల్లోనూ మాట్లాడే మాటల్లోనూ ఉంటుంది.. ఇది వేదవాక్కు’, ‘న్యాయంగానూ ధైర్యంగానూ ఓ ఆడపిల్ల ఉంటే.. ఆ దేవుడి దిగి వచ్చి తనకు తోడుగా ఉంటాడు’, ‘ఈ రోజు నుంచి మొదలవుతుంది జాతర.. మిఠాయి కిల్లీ’ అంటూ రజినీ చెప్పిన డైలాగ్స్ మాస్  ఆడియెన్స్‌కు ట్రీట్‌లా ఉన్నాయి.
నయనతార అందంగా ఉంది. ఇక క్రూరమైన విలన్‌గా జగపతి బాబు మెప్పించారు. ఇక ఈ చిత్రంలో మీనా, కుష్బూ, ప్రకాష్ రాజ్ ముఖ్య పాత్రల్లో కనిపించబోతోన్నారు. డి ఇమ్మాన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందరినీ మెప్పించేలా ఉంది. సన్ పిక్చర్స్ ఈ చిత్రాన్ని భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. వెట్రి సినిమాటోగ్రఫర్‌గా, రూబెన్ ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అప్పన్న చందనోత్సవ వేడుక విషాదం .. గాలివానకు గోడ కూలింది.. 8 మంది మృతి!!

భార్యను, కొడుకును తుపాకీతో కాల్చి చంపి టెక్కీ ఆత్మహత్య... ఎక్కడ?

Sailajanath: వైకాపా సింగనమల అసెంబ్లీ సమన్వయకర్తగా సాకే శైలజానాథ్

అప్పన్న స్వామి ఆలయంలో అపశ్రుతి.. గోడకూలి ఎనిమిది మంది భక్తులు మృతి (video)

Sritej: ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన పుష్ప2 బాధితుడు శ్రీతేజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చింతపండు-మిరియాల రసం ఆరోగ్య ప్రయోజనాలు

ఈ ఒక్క చెక్క ఎన్నో అనారోగ్యాలను పారదోలుతుంది, ఏంటది?

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments