Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

దీపావళి లోపే జియోఫోన్ నెక్స్ట్.. ఫీచర్స్ ఏంటంటే?

Advertiesment
JioPhone Next
, సోమవారం, 25 అక్టోబరు 2021 (13:51 IST)
Jio next
ప్రపంచంలోనే అత్యంత చౌకైన స్మార్ట్‌ఫోన్ జియోఫోన్ నెక్స్ట్ కోసం ఎదురుచూస్తున్నవారికి శుభవార్త. జియోఫోన్ నెక్స్ట్ స్మార్ట్‌ఫోన్ దీపావళిలోపే లాంఛ్ చేసేందుకు రిలయన్స్ సన్నాహాలు చేస్తోంది. వాస్తవానికి ఈ స్మార్ట్‌ఫోన్ సెప్టెంబర్ 10న వినాయక చవితి సందర్భంగా ఈ స్మార్ట్‌ఫోన్ లాంఛ్ కావాల్సింది.

కానీ జియోఫోన్ నెక్స్‌ట్ అడ్వాన్స్‌డ్ ట్రయల్స్‌లో ఉందని, దీపావళి కన్నా ముందే ఈ స్మార్ట్‌ఫోన్‌ను లాంఛ్ చేస్తామని జియో, గూగుల్ ఆరోజే సంయుక్తంగా ప్రకటన విడుదల చేశాయి. ప్రకటించినట్టుగానే దీపావళి కన్నా ముందే జియోఫోన్ నెక్స్‌ట్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో సంచలనాలు సృష్టించడానికి రాబోతోంది.
 
జూన్ 24న జరిగిన రిలయన్స్ వార్షిక సర్వసభ్య సమావేశంలో ఆర్ఐఎల్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ముకేష్ అంబానీ జియోఫోన్ నెక్స్ట్ స్మార్ట్‌ఫోన్‌ను ఆవిష్కరించారు. జియోఫోన్ నెక్స్ట్ మేడ్ ఇన్ ఇండియా స్మార్ట్‌ఫోన్. 30 కోట్ల మంది 2జీ యూజర్లు తక్కువ బడ్జెట్‌లో 4జీ నెట్వర్క్‌కు మారేందుకు ఈ స్మార్ట్‌ఫోన్ ఉపయోగపడనుంది. జియో, గూగుల్ కలిసి భారతీయుల అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌ను ఆప్టిమైజ్ చేసి ఈ స్మార్ట్‌ఫోన్‌ను రూపొందించాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌లో ఆటోమెటిక్ రీడ్ ఎలౌడ్ ఫీచర్ ఉంది. స్క్రీన్ పైన ఉన్న టెక్స్‌ట్‌ను స్మార్ట్‌ఫోన్ చదివి వినిపిస్తుంది.
 
ఫీచర్స్
దీంతో పాటు లాంగ్వేజ్ ట్రాన్స్‌లేషన్, ఆగ్యుమెంటెడ్ రియాల్టీ ఫిల్టర్స్‌తో స్మార్ట్ కెమెరా, వాయిస్ అసిస్టెంట్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. జియోఫోన్ నెక్స్‌ట్ యూజర్లు కంటెంట్‌తోపాటు, అద్భుతమైన కెమెరా ఎక్స్‌పీరియెన్స్ పొందేందుకు ఈ ఫీచర్స్ ఉపయోగపడతాయి. లేటెస్ట్ ఆండ్రాయిడ్ ఫీచర్స్‌తో పాటు సెక్యూరిటీ అప్‌డేట్స్ కూడా లభిస్తాయి. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 215 ప్రాసెసర్ ఉంటుందని అంచనా. 2జీబీ, 3జీబీ వేరియంట్లలో ఈ స్మార్ట్‌ఫోన్ రిలీజ్ కానుంది. 16జీబీ, 32జీబీ స్టోరేజ్ ఆప్షన్స్ ఉంటాయి. మైక్రోఎస్‌డీ కార్డుతో స్టోరేజ్ పెంచుకోవచ్చు. 5.5 అంగుళాల హెచ్‌డీ+ డిస్‌ప్లే ఉంటుంది.
 
జియోఫోన్ నెక్స్‌ట్ స్మార్ట్‌ఫోన్‌లో 13 మెగాపిక్సెల్ సింగిల్ రియర్ కెమెరా ఉంటుంది. సెల్ఫీలు, వీడియోకాల్స్ కోసం 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంటుంది. ఇందులో 2,500ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఆండ్రాయిడ్ 11 గో ఎడిషన్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో ఈ స్మార్ట్‌ఫోన్ పనిచేస్తుంది. జియోఫోన్ నెక్స్‌ట్ స్మార్ట్‌ఫోన్ ప్రారంభ ధర రూ.3,499 ఉండొచ్చని అంచనా.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఉత్తరప్రదేశ్‌‌లో తొలి జికా వైరస్ కేసు.. ఎయిర్ ఫోర్స్ సిబ్బంది ఒకరికి..