Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇది నా ప్రామిస్ అంటున్న దసరా స్టార్ నాని

Webdunia
సోమవారం, 27 మార్చి 2023 (13:47 IST)
Nani, keerthi, deekshit
నేచురల్ స్టార్ నాని, శ్రీకాంత్ ఓదెల  దర్శకత్వం వహిస్తున్న దసరా చిత్రం టీజర్, పాటలకు ట్రెమండస్ రెస్పాన్స్  వచ్చింది. దసరా ట్రైలర్ నేషనల్ వైడ్ గా ట్రెండ్ అవుతూ సినిమాపై మరింత క్యురియాసిటీని పెంచింది. కీర్తి సురేష్ కథానాయికగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి భారీ ఎత్తున నిర్మిస్తున్న ఈ చిత్రం మార్చి 30న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఏకకాలంలో గ్రాండ్ గా విడుదలౌతుంది. ఈ నేపధ్యంలో అనంతపురంలో దసరా దూమ్ ధామ్ ప్రీరిలీజ్ ఈవెంట్ ని చాలా గ్రాండ్ గా నిర్వహించారు. 
 
నాని మాట్లాడుతూ.. ఇన్ని రోజులు మిమ్మ్మల్ని మెప్పించే మాస్ చూసి వుంటారు. దసరాతో మీ గుండెల్ని హత్తుకునే మాస్ చూపిస్తాను. ఇది నా ప్రామిస్. కళ్ళల్లో చిన్న గ్లిట్టర్ తో విజిల్స్ వేసే ఆనందం దసరాతో ఎక్స్ పీరియన్స్ చేస్తారు. దసరా చాలా మనసుకు దగ్గరైనా సినిమా. ఏడాది కాలం పాటు దమ్ము ధూళి.. చాలా కష్టాలు పడి టీం అంతా హార్డ్ వర్క్ చేశాం. దసరా లాంటి గొప్ప ప్రాజెక్ట్ ని నిర్మించిన నిర్మాతలు సుధాకర్, శ్రీకాంత్ గారికి కృతజ్ఞతలు. నా ఫ్రండ్స్ పాత్రలు చేసిన నటులందరికీ థాంక్స్.ఈ సినిమా మన కెరీర్ లో స్పెషల్ మూవీగా నిలిచిపోతుంది. కాసర్ల శ్యాం గారు రాసిన ప్రతి పాట సంచలనం అవుతుంది. ఫైట్ మాస్టర్ సతీష్.. ఈ సినిమాతో ఆయన డేట్లు దొరకవు. దసరాలో యాక్షన్ వేరే లెవల్ లో చేశారు. సత్యన్ సూర్య, శ్రీకాంత్,  సంతోష్ నారాయణ్ మీ అందరికీ పర్ఫెక్ట్ మూవీని ఇవ్వడానికి చివరి నిమిషం వరకూ కష్టపడుతున్నారు. వారు పడుతున్న కష్టం మార్చి 30న మీరు చూస్తారు. ఆర్ట్ డైరెక్టర్ అవినాష్ గారు 22 ఎకరాల్లో వీర్లపల్లిని క్రియేట్ చేశారు. మీరు 30న థియేటర్ లో అడుగుపెట్టిన వెంటనే ఆ వూర్లోకి తీసుకెళ్ళిపోతాం. ఎడిటర్ నవీన్ క్రిస్ప్ గా ఎడిట్ చేశారు. సూరి పాత్రలో దీక్షిత్ అద్భుతంగా చేశాడు. సాయి కుమార్ గారు, సముద్రఖని గారు షైన్ టాం చాకో ఇలా అందరూ అద్భుతంగా చేశారు. నేను లోకల్ తర్వాత నేను కీర్తి కలిసి చేస్తే ఒక మెమరబుల్ సినిమా చేయాలని అనుకున్నాం. దసరా కి మించిన మెమరబుల్ మూవీ అంత ఈజీగా ఏ నటులకి దొరకదు అని తెలిపారు.
 
కీర్తి సురేష్ మాట్లాడుతూ..ధరణి కత్తి పట్టాడు. మార్చి 30న చూద్దాం. నేను నాని కలసి నేను లోకల్ అనే సినిమా చేశాం. కానీ దసరానే  నాకు లోకల్ అనిపిస్తుంది. నాని గొప్ప స్నేహితుడు, సహా నటుడు. ఈ సినిమా తర్వాత మీ అందరికీ వెన్నెలగా గుర్తుంటాను. దర్శకుడు శ్రీకాంత్ చాలా కష్టపడి ఈ కథని రాశారు. ఈ కథని ఇంతపెద్ద కాన్వాస్ రూపొందించే అవకాశం ఒక కొత్త దర్శకుడికి ఇచ్చిన మా నిర్మాతలకు కృతజ్ఞతలు. దసరా అన్ని ఎలిమెంట్స్ వున్న ఫుల్ ప్యాకేజీ. డీవోపీ సత్యన్ సూర్యన్ గారు అద్భుతమైన వర్క్ ఇచ్చారు. మార్చి 30 దసరా మీ ముందుకు వస్తుంది. ఎట్లయితే గట్లయితది చూసుకుందాం’’ అన్నారు. 
 
దీక్షిత్ శెట్టి మాట్లాడుతూ, శ్రీకాంత్ నన్ను ఎంతో కంఫర్ట్ బుల్ గా చూసుకున్నారు. ఆయన దేశంలోనే టాప్ దర్శకుడిగా ఎదుగుతారు. నాని గారు గ్రేట్ హ్యూమన్ బీయింగ్. ఈ సినిమా కోసం టూర్ చేస్తున్నపుడు నన్ను చిన్నపిల్లాడి చేయి పట్టుకొని స్టేజ్ పై తీసుకొచ్చి నా గురించి చెప్పి నాకు ఎంతో కాన్ఫిడెన్స్ ఇచ్చారు. నాని గారికి ఎప్పుడూ రుణ పడి వుంటాను. కీర్తి సురేష్ గారు చాలా కైండ్ హార్ట్. ఇందులో సూరి అనే పాత్ర చేశాను. ఈ పాత్ర నేను బాగా చేశానని మీకు అనిపిస్తే దానికి కారణం కీర్తి గారు అని చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీలో ఒక రోజు ముందుగానే సామాజిక పింఛన్ల పంపిణీ.. నేమకల్లుకు సీఎం బాబు

ఆంధ్ర నుంచి ఆఫ్రికాకు రేషన్ బియ్యం, కాకినాడ పోర్టు స్మగ్లింగ్ కేంద్రంగా మారిందా?

రేవంత్ రెడ్డి "ఏఐ సిటీ"కి శంకుస్థాపన ఎప్పుడో తెలుసా?

హైదరాబాద్‌- 50వేల కేసులు, రూ.10.69 కోట్ల ఫైన్.. 215మంది మృతి

12 అడుగుల భారీ గిరినాగు.. రక్తపింజరను మింగేసింది.. ఎలా పట్టుకున్నారంటే? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

తర్వాతి కథనం
Show comments