Webdunia - Bharat's app for daily news and videos

Install App

కిరణ్ అబ్బవరం కొత్త చిత్రానికి దిల్ రూబా టైటిల్ ఖరారు

డీవీ
శుక్రవారం, 20 డిశెంబరు 2024 (15:08 IST)
Kiran Abbavaram
హీరో కిరణ్ అబ్బవరం కొత్త చిత్రానికి "దిల్ రూబా" అనే టైటిల్ ఖరారు చేశారు. ఈ సినిమాలో రుక్సర్ థిల్లాన్ హీరోయిన్ గా నటిస్తోంది. "దిల్ రూబా" చిత్రాన్ని శివమ్ సెల్యులాయిడ్స్ మరియు ప్రముఖ మ్యూజిక్ లేబుల్ సారెగమ తమ నిర్మాణ సంస్థ అయినటువంటి ఏ యూడ్లీ ఫిలిం సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.రవి, జోజో జోస్, రాకేష్ రెడ్డి,సారెగమ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. విశ్వ కరుణ్ దర్శకత్వం వహిస్తున్నారు.
 
"దిల్ రూబా" సినిమా టైటిల్ అనౌన్స్ మెంట్ సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తోంది. ఈ పోస్టర్ లో కిరణ్ అబ్బవరం యూనిక్ స్టైల్, యాటిట్యూడ్ తో కనిపిస్తున్నారు. 'హిస్ లవ్, హిస్ యాంగర్..' అనే కొటేషన్ కిరణ్ అబ్బవరం క్యారెక్టర్ ను రిఫ్లెక్ట్ చేస్తోంది. లవ్, రొమాంటిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా "దిల్ రూబా" సినిమా ప్రేక్షకుల్ని ఆకట్టుకోనుంది. ఈ చిత్రానికి సామ్ సీఎస్ సంగీతాన్ని అందిస్తుండగా, డానియేల్ విశ్వాస్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు. ప్రవీణ్ కేఎల్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. "క" సూపర్ హిట్ తర్వాత కిరణ్ అబ్బవరం చేస్తున్న చిత్రంగా "దిల్ రూబా"పై హై ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. ఈ సినిమా ను ఫిబ్రవరి లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కాకినాడలో ప్రేమజంట మృతి.. రైల్వే ట్రాక్ వద్ద ప్రేయసిని ప్రియుడు హత్య చేశాడా?

కాళేశ్వరం మూడు బ్యారేజీలను మరమ్మతు చేసేందుకు తెలంగాణ సన్నాహాలు

హైదరాబాద్ సిటీ కాలేజీలో పైథాన్ కలకలం.. (వీడియో)

భర్త మరో స్త్రీతో ఎఫైర్: కాల్ రికార్డ్, లొకేషన్ తెలుసుకునే హక్కు భార్యకు వుందన్న హైకోర్టు

భార్య మీద అలిగిన ఓ భర్త కరెంట్ స్తంభం ఎక్కాడు, ఆ తర్వాత?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉపవాసం సులభతరం: మీ వ్రత మెనూలో పెరుగును చేర్చడానికి 5 కారణాలు

ప్రపంచ హృదయ దినోత్సవాన్ని కాలిఫోర్నియా బాదంతో జరుపుకోండి

కాలేయ క్యాన్సర్ ప్రారంభ లక్షణాలు ఎలా వుంటాయి?

బాదం పప్పులు రోజుకి ఎన్ని తినాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఒక్క లవంగాను నోట్లో వేసుకుని నమిలితే...

తర్వాతి కథనం
Show comments