Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

క హీరో కిరణ్ అబ్బవరం కొత్త చిత్రానికి సిద్ధమవుతున్నాడు

Advertiesment
Kiran Abbavaram

డీవీ

, బుధవారం, 11 డిశెంబరు 2024 (18:41 IST)
Kiran Abbavaram
క చిత్రం బ్లాక్‌బస్టర్ విజయం తర్వాత కిరణ్ అబ్బవరం మరోసారి తెరపైకి రావడానికి సిద్ధంగా వున్నాడు. ఈసారి సరికొత్త కథాంశంతో యాక్షన్ కథాంశంతో రాబోతున్నాడు. ఇప్పటికే కిరణ్ టీమ్ కథను మెరుగులు దిద్దుతోంది. శివమ్ సెల్యులాయిడ్స్ సరేగమ సౌత్ యూడ్లీ ఫిల్మ్స్ నిర్మాణంలో ఈ చిత్రం రూపొందబోతోందని నేడు తెలియజేశారు. ధీనికి సంబంధించిన మిగతా వివరాలు త్వరలో తెలియజేస్తామని ప్రకటించారు. 
 
ఎస్.ఆర్. కళామండపంతో గుర్తింపు పొందిన కిరణ్ అబ్బవరం ఆ తర్వాత కొన్ని ఫెయిల్యూర్ చవిచూసి పట్టువదలని విక్రమార్కుడిగా ‘క’ చిత్రంతో హిట్ సంపాదించాడు. ఆ  సినిమా విడుదలకుముందే చిత్ర నిర్మాత చింత గోపాలకృష్ణ రెడ్డి తదుపరి చిత్రాన్ని కూడా కిరణ్ తో తెరకెక్కిస్తానని ప్రకటించాడు. ఆ సినిమాకు సుజీత్‌, సందీప్‌ దర్శకత్వం వహించారు. వారు కూడా కిరణ్ తో మరో సినిమాను చేయాలనుందని వెల్లడించారు. కానీ ఈసారి సరికొత్త టీమ్ తో కిరన్ అబ్బవరం రాబోతున్నాడని తెలుస్తోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Akhanda 2 : నందమూరి బాలకృష్ణ అఖండ 2 తాండవం డేట్ ఫిక్స్