Webdunia - Bharat's app for daily news and videos

Install App

#SaahoStorm నాలుగు రోజుల్లో రూ.330 కోట్ల గ్రాస్

Webdunia
బుధవారం, 4 సెప్టెంబరు 2019 (10:08 IST)
బాహుబలి హీరో ప్రభాస్ నటించిన తాజా చిత్రం సాహో. ఈ చిత్రం గత శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. అయితే, ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. అయినప్పటికీ కలెక్షన్ల పరంగా సునామీ సృష్టిస్తోంది. గత నాలుగు రోజుల్లో ఈ చిత్రం 330 కోట్ల రూపాయల గ్రాస్‌ను వసూలు చేసి, బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. సుజిత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ నిర్మాణ సంస్థ నిర్మించగా బాలీవుడ్ నటి శ్రద్ధా కపూర్ హీరోయిన్‌గా నటించింది. 
 
మరోసారి చూస్తే నచ్చుతుంది...
ఇదిలావుంటే, ఈ చిత్రానికి వచ్చిన టాక్‌పై ద‌ర్శ‌కుడు సుజీత్ త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో భావోద్వేగ‌పు పోస్ట్ చేశారు. "నేను 17 ఏళ్ళ వ‌య‌స్సులో ఉన్న‌ప్పుడు ల‌ఘు చిత్రం తెర‌కెక్కించాను. ఆ స‌మ‌యంలో డ‌బ్బులు లేవు. ఒక టీం లేదు. కేవ‌లం నా ఫ్యామిలీ, ఆర్కుట్ ఇవి రెండు మాత్ర‌మే నాకు మ‌ద్దతుగా ఉండేవి. నా ల‌ఘు చిత్రాల‌కి 90 శాతం ఎడిటింగ్‌, దర్శకత్వం‌, కెమెరా వ‌ర్క్ నేనే చేశాను. ఆ స‌మ‌యంలో నేను చేసిన త‌ప్పుల నుండి చాలా నేర్చుకున్నాను. విమ‌ర్శ‌కుల విమ‌ర్శ‌లు నాకు ఎల్ల‌ప్పుడు ఓ ప్రోత్సాహంలాగా అనిపిస్తుంటుంది. 
 
చాలా దూరం ప్ర‌యాణించి, ఎన్నో అడ్డంకులు ఎదుర్కొన్నాను. కానీ సాధించాల‌నుకున్న‌ది ఎప్పుడు వ‌దిలి పెట్ట‌లేదు. ఈ రోజు 'సాహో' చిత్రాన్ని కొంత మంది ప్ర‌జ‌లు చూశారు. ఈ చిత్రం నుండి కొంద‌రు చాలా ఆశించారు. కొంద‌రు చాలా ఇష్ట‌ప‌డ్డారు. సినిమా చూసిన వారంద‌రికి నా ప్ర‌త్యేక ధ‌న్య‌వాదాలు. మీరు ఏదైన మిస్ అయితే మ‌రొక‌సారి సినిమా చూడండి. మీరు ఇంకా ఎక్కువ ఎంజాయ్ చేస్తార‌ని నేను హామీ ఇస్తున్నాను' అని సుజిత్ తన పోస్టులో కోరారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కన్నతల్లి ఘాతుకం... వేటకొడవలితో ఇద్దరు పిల్లల్ని నరికి చంపేసింది...

భార్య కళ్లెదుటే భర్త తల నరికి పట్టుకెళ్లిన గ్యాంగ్, గుడి ముందు విసిరేసారు

జైలులో ఉన్న ముస్కాన్‌ గర్భందాల్చింది... ఆ బిడ్డకు తండ్రి ఎవరు?

జగన్ అక్రమాస్తుల కేసు : 793 కోట్లను అటాచ్ చేసిన ఈడీ

నీకూ, నీ అన్నయ్యకూ ప్యాకేజీలు ఇస్తే సరిపోతుందా.. మాట్లాడవా? ఆర్కే రోజా ప్రశ్న

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

తర్వాతి కథనం
Show comments