Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ప్ర‌భాస్, రాజ‌మౌళి మధ్య గొడ‌వ జ‌రిగిందా..? ఇంత‌కీ కార‌ణం..?

ప్ర‌భాస్, రాజ‌మౌళి మధ్య గొడ‌వ జ‌రిగిందా..? ఇంత‌కీ కార‌ణం..?
, మంగళవారం, 13 ఆగస్టు 2019 (15:36 IST)
యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ తాజా చిత్రం సాహో. ఈ సినిమాకి ర‌న్ రాజా ర‌న్ ఫేమ్ సుజిత్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ యు.వి. క్రియేష‌న్స్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 30న ప్ర‌పంచ వ్యాప్తంగా సాహో రిలీజ్ కానుంది. ఇటీవ‌ల ముంబయిలో సాహో ట్రైల‌ర్ రిలీజ్ చేసారు. ఈ ట్రైల‌ర్‌కు ట్రెమండ‌స్ రెస్పాన్స్ వ‌చ్చింది.
 
తెలుగు సినీ ప్ర‌ముఖులే కాకుండా త‌మిళ‌, మ‌ల‌యాళ‌, బాలీవుడ్ సినీ ప్ర‌ముఖులు కూడా స్పందించారు. కానీ... బాహుబ‌లి ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి మాత్రం సాహో ట్రైల‌ర్ పైన స్పందించ‌లేదు. సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే జ‌క్క‌న్న సాహో ట్రైల‌ర్ గురించి ట్వీట్ చేయ‌క‌పోవ‌డంతో ప్ర‌భాస్, రాజ‌మౌళి మ‌ధ్య గొడ‌వ జ‌రిగిందనీ, అందుకే ట్వీట్ చేయ‌లేదు అంటూ వార్త‌లు వ‌స్తున్నాయి కానీ.. అలాంటిది ఏం లేద‌ట‌. 
 
కాక‌పోతే ఇక నుంచి ఏ సినిమా గురించి ట్వీట్ చేయ‌కూడ‌దు అని నిర్ణ‌యం తీసుకున్నాడ‌ట‌ రాజమౌళి. ఎందుకంటే... సినిమాల గురించి ట్వీట్ చేస్తే... ప్రాబ్లమ్ అవుతుంద‌ట‌. న‌చ్చ‌ని సినిమా గురించి కూడా న‌చ్చిన‌ట్టుగా ట్వీట్ చేయాల్సి వ‌స్తుంద‌ట. అందుక‌నే ఏ సినిమా గురించి ట్వీట్ చేయ‌కూడ‌దు అని నిర్ణ‌యం తీసుకున్నాడ‌ట‌. అందుక‌నే ప్ర‌భాస్‌కి డైరెక్ట్‌గా ఫోన్ చేసి ట్రైల‌ర్ బాగుంద‌ని చెప్పాడ‌ట‌. అదీ... సంగ‌తి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సంగీత వాద్య కళాకారులకు నా వంతు సాయం చేస్తా! – చిరంజీవి